వేశ్యగా నటించేందుకు నో చెప్పింది  

Actress Sredevi Said No To Prostitute Role-

English Summary:At the time, many of the films in Telugu and Tamil with Vijay is currently kurrakaru celestial damsel anipincukunna Aunt Sridevi starrer 'tiger' is playing an important role in the film will go to the thing. The film's shooting is going faster and faster.She no longer has the green signal to play a role in the Telugu and Tamil films. She is already a major role in the film, the director mahesbabu Koratala Shiva's coming out selectively.With whom the heroine-oriented film, wanting to date a Telugu director went on to capture a script. When the point is that Sridevi Chennai director at the script, the story of this film is that I will not ceppesindata vinakundane.The heroine of the story appears to be a prostitute. The director wants to play the role of a prostitute that sridevito roasting.When the role of the heroine Sridevi got antettu the director, now I'll have such characters as the paddarata Mandi. He grabbed the back of his scripts again, or what the director said.Egabadutunte prostitute heroine Sridevi role, it will also be interested in assuming the director. Sridevi natincoddani considers herself at this age.......

తెలుగులో ఎన్నో సినిమాలు చేసి అప్పట్లో కుర్రకారు అతిలోక సుందరి అనిపించుకున్న ఆంటీ శ్రీదేవి ప్రస్తుతం తమిళంలో విజయ్‌ హీరోగా నటిస్తున్న ‘పులి’ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈమె వరుసగా తెలుగు మరియు తమిళ సినిమాల్లో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తోంది. ఈమెను ఇప్పటికే మహేష్‌బాబు సినిమాలో ఒక ముఖ్య పాత్రకు దర్శకుడు కొరటాల శివ ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈమెతో ఒక తెలుగు దర్శకుడు హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమా చేయాలనే కోరికతో ఒక స్క్రిప్ట్‌ పట్టుకుని వెళ్లాడు.

చెన్నైలో ఉన్న శ్రీదేవికి ఆ దర్శకుడు తన వద్దనున్న స్క్రిప్ట్‌లోని పాయింట్‌ చెప్పగానే, మొత్తం కథ వినకుండానే నేను ఈ సినిమా చేయనని చెప్పేసిందట. ఆ కథలో హీరోయిన్‌ వేశ్యగా కనిపిస్తుంది. ఆ వేశ్య పాత్రను శ్రీదేవితో వేయించాలని ఆ దర్శకుడు అనుకున్నాడు. హీరోయిన్‌ పాత్ర చెప్పగానే శ్రీదేవి సదరు దర్శకుడిపై అంతెత్తు లేచి, ఇప్పుడు నేను అలాంటి పాత్రలు చేస్తానా అంటూ మండి పడ్డారట. దాంతో ఆ దర్శకుడు చేసేది లేక తన స్క్రిప్ట్‌ను పట్టుకుని వెనక్కు మళ్లినట్లు చెబుతున్నారు. వేశ్య పాత్రల్లో నటించేందుకు హీరోయిన్‌లు ఎగబడుతుంటే శ్రీదేవి కూడా ఆసక్తి చూపుతుందేమో అని ఆ దర్శకుడు భావించి ఉంటాడు. కాని శ్రీదేవి ఈ వయస్సులో వేశ్యగా నటించొద్దని భావించింది.