బరువు తగ్గనున్న బ్యూటి

సోనారిక భడోరియా .

మన తెలుగు సినిమాకు పెద్దగా తెలిసిన పేరు కాదు కాని హిందీ సీరియళ్ళు చూసే అలవాటు ఉన్న ఏ ఒక్కరు కుడా గుర్తు పట్టక మానరు.

కుర్రకారు ఈ భామ అంటే పడిచచ్చిపోతారు.ఇంత అందం ఇంకా సీరియళ్ళకు పరిమితం అవడం ఏమిటి అని కుర్రాళ్ళు బాధపడేలోపే తెలుగు సినిమాకు రయ్ రయ్ మంటూ దూసుకొచ్చింది ఈ నార్త్ బ్యూటి.

మొదటి చిత్రం నాగశౌర్య సరసన చేసిన జాదుగాడు.సినిమా పెద్దగా ఆడలేదు.

తోలి సినిమానే నిరుత్సాహపరిచింది.అయినా సోనారిక తన అందంతో అందరిని మెప్పించింది.

Advertisement

తద్వారా మంచు విష్ణు ఈ మధ్యే ప్రారంభించిన కొత్త సినిమాలో అవకాశం కొట్టేసింది.ఈ సినిమా కాకుండా కుడా కొత్త ఆఫర్లు అమ్మడు దగ్గరికి వస్తున్నాయట.

మంచు విష్ణు తో చేస్తున్న సినిమాలో మరింత గ్లామరస్ గా కనిపించడానికి బరువు తగ్గుతోందట సోనారిక.దానికోసమే విరామం లేకుండా జిమ్ లో గడుపుతోంది.

సోనరిక కష్టం పనికొచ్చి, ఆ సినిమా అయినా హిట్ అయ్యి త్వరలోనే పెద్ద హీరోయిన్ల సరసన అమ్మడుని చేర్చితే బాగుండు .ఇప్పటికే సీరియళ్ళకు దూరం అయిందని బాధపడుతోంది నార్త్ కుర్రకారు .సోనరిక ఇక్కడే, తెలుగులో పెద్ద హీరోయిన్ గా సెటిల్ అయిపోతే ఏమవుతుందో పాపం వాళ్ళ పరిస్థితి.

న్యూస్ రౌండప్ టాప్ 20 
Advertisement

తాజా వార్తలు