నేనేం ఆపరేషన్‌ చేయించుకుని అబ్బాయిగా మారిపోలేదు  

Actress Snigdha Comments On Her Getup-dressing Style,look Has Boys,oh Baby,snigdha,so Many Peoples Are Doubt In Snigdha Boy Or Girl,tollywood

పెరిగిన టెక్నాలజీని ఉపయోగించుకుని అమ్మాయిలు అబ్బాయిల మాదిరిగా, అబ్బాయిలు అమ్మాయిల మాదిరిగా మారడం చాలా కామన్‌ అయ్యింది. తాజాగా సింగర్‌ మరియు నటి అయిన స్నిగ్ద అబ్బాయిగా మారిపోయింది అంటూ వార్తలు వచ్చాయి. మొదటి నుండి కూడా కుర్రాడి మాదిరిగా వేశాలు వేస్తూ ఉండే ఈ అమ్మాయిలో ఎక్కువగా మగ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అంటూ విమర్శలు ఎదుర్కొంది..

నేనేం ఆపరేషన్‌ చేయించుకుని అబ్బాయిగా మారిపోలేదు-Actress Snigdha Comments On Her Getup

ఇదే సమయంలో స్నిగ్ద కొన్ని రోజులుగా కనిపించకుండా పోయింది. దాంతో ఆమె ట్రాన్స్‌ జెండర్‌ ఆపరేషన్‌ చేయించుకున్నట్లుగా ప్రచారం జరిగింది.

గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారంపై స్నిగ్ద సీరియస్‌గా స్పందించింది. తాను ఆపరేషన్‌ చేయించుకున్నట్లుగా ప్రచారం చేస్తున్న వారికి పని పాట లేకపోయి ఉంటుంది.

అందుకే ఏదో ఒక పుకారు పుట్టిస్తూనే ఉంటారు. నేను అప్పుడు, ఇప్పుడు ఎప్పుడు అమ్మాయినే. నేను అమ్మాయినే అనే విషయం చెప్పాల్సి రావడం బాధగా ఉంది..

అయినా కూడా తప్పడం లేదు. నాకు దేవుడు మంచి గొంతు ఇవ్వడంతో పాటు, అన్ని విధాలుగా మంచి చేశాడు. అలాంటప్పుడు నేను ఎందుకు ట్రాన్స్‌ జెండర్‌ ఆపరేషన్‌ చేయించుకుంటాను అంటూ ప్రశ్నించింది.

ఎన్నో చిత్రాల్లో కమెడియన్‌గా నటించిన స్నిగ్ద మొన్న వచ్చిన ఓ బేబీ చిత్రంలో కూడా ఒక చిన్న పాత్రలో నటించింది. అయినా కూడా ఈమె గురించి మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆమెకు ఇష్టమైన డ్రస్‌లను ఆమె వేసుకుంటుంది. దాన్ని ఎందుకు తప్పుగా చూస్తున్నారంటూ కొందరు స్నిగ్దకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.