స్నేహ అమ్మ అవ్వనుంది

హీరోయిన్‌ స్నేహ 2012లో తమిళ నటుడు ప్రసన్నను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెల్సిందే.వీరిద్దరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా మరి కొన్ని రోజుల్లో పండంటి పాపాయి వీరి ఇంట అడుగు పెట్టబోతుంది.

 Actress Sneha To Become A Mother?-TeluguStop.com

నేడు తమిళనాడు ప్రజలు కొత్త సంవత్సర పండుగ చేసుకుంటున్నారు.ఈ సందర్బంగా ప్రసన్న ఈ గుడ్‌ న్యూస్‌ను ట్విట్టర్‌ ద్వారా ప్రకటించాడు.

ఈ ప్రత్యేకమైన రోజున ఒక మంచి విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని, త్వరలో మా ఇంటికి కొత్త మెంబర్‌ రాబోతున్నారని, తాము అంతా కూడా ఆ కొత్త మెంబర్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.ఈ కొత్త సంవత్సరం అందరి మంచి జరగాలని ఆయన కోరుకుంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు.

తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాలు నటించి మంచి గుర్తింపు తెచ్చుకుని, అశేష అభిమానులను సొంతం చేసుకున్న స్నేహ తల్లి కాబోతున్నందుకు అంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube