పోలీసులను ఆశ్రయించిన స్టార్ హీరోయిన్ స్నేహ.. మోసం చేశారంటూ?

తెలుగులో పదుల సంఖ్యలో సినిమాల్లో హీరోయిన్ పాత్రల్లో నటించి నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న స్నేహ అవకాశాలు తగ్గిన తర్వాత అక్క, వదిన తరహా పాత్రల్లో నటిస్తున్నారు.ఆ పాత్రల ద్వారా స్నేహ విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు.

 Actress Sneha  Files Complaint Two Business Man Chennai , Actress Sneha , Chenna-TeluguStop.com

ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు యాడ్స్ లో కూడా నటిస్తూ స్నేహ సత్తా చాటుతున్నారు.కుటుంబ కథలను ఇష్టపడే ప్రేక్షకులకు స్నేహ నటించే సినిమాలు ఆకట్టుకుంటున్నాయి.

వివాదాలకు దూరంగా ఉండే హీరోయిన్ గా స్నేహకు పేరుంది.అయితే ఈ నటి తాజాగా పోలీసులను ఆశ్రయించి వార్తల్లో నిలిచారు.స్నేహ కానత్తూర్ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు వ్యాపారవేత్తల గురించి ఫిర్యాదు చేశారు.చెన్నైకు చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు వ్యాపారం నిమిత్తం తమనుంచి డబ్బు అప్పుగా 26 లక్షల రూపాయలు తీసుకున్నారని స్నేహ తెలిపారు.

అయితే ప్రస్తుతం వడ్డీ చెల్లించమని అడిగితే వ్యాపారవేత్తలు వడ్డీ చెల్లించకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని స్నేహ పేర్కొన్నారు.

తాను అప్పుగా ఇచ్చిన 26 లక్షల రూపాయలను తిరిగి ఇవ్వడానికి కూడా వ్యాపారవేత్తలు అంగీకరించడం లేదని స్నేహ వెల్లడించారు.

స్నేహ ఫిర్యాదుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.తెలుగు, తమిళ భాషల్లో స్నేహ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను కొనసాగిస్తున్నారు.స్నేహ ప్రసన్న అనే నటుడిని పెళ్లి చేసుకోగా ఈ దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.

Telugu Actress Sneha, Chennai-Movie

పెళ్లి తర్వాత చాలామంది నటీనటులకు అవకాశాలు తగ్గుతుంటే స్నేహకు మాత్రం భిన్నంగా సినిమా ఆఫర్లు పెరుగుతుండటం గమనార్హం.స్నేహ ఫిర్యాదు చేసిన వ్యక్తులు ఈ కేసు గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.సీనియర్ స్టార్ హీరోల సినిమాలలో సైతం హీరోయిన్ స్నేహకు సినిమా ఆఫర్లు బాగానే వస్తున్నాయని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube