అలనాటి నటుల్లో నటి సితార అంటే తెలియని వారు ఉండరు.తెలుగు, కన్నడ, ఇండస్ట్రీ లో ఎంత గొప్ప పేరున్న నటీమణుల్లో సితార గారు ఒకరు.
ఎందుకో ఆమెని చూస్తుంటే అచ్చం మనింటి ఆడపడుచుని చూస్తున్నట్టే ఉంటుంది.ఈమె ఒకప్పటి హీరోయిన్ అయినప్పటికీ ప్రతి సినిమాలో ఇప్పుడు అమ్మ పాత్రలో, వదిన పాత్రలో ఎవరైనా కావాలంటే ఎక్కువ శాతం దర్శక నిర్మాతలకు గుర్తొచ్చేది నటి సితారా మాత్రమే.
అలా కన్నడ, తెలుగు అనే తేడా లేకుండా అందరికి దగ్గరయిన నటి సితారా జీవితంలో కొన్ని విషాద సంఘటనలు కూడా ఉన్నాయి.ఇటీవలే ఆమె చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం…

నటి సితారా కేరళలోని కిలిమానూర్ లో జన్మించారు.ఈమె తల్లిదండ్రుల పేర్లు రామేశ్వరన్ నాయర్ మరియు వల్సల నాయర్.అయితే సీతారా కాలేజీలో చదువుతూ సినిమాల్లోకి ప్రవేశించింది.
అలా నటి సితార మాతృ బాషా మలయాళం అయినప్పటికీ కన్నడ ప్రేక్షకులకి ఎంతో…దగ్గర అయ్యారు.కన్నడ సూపర్ హిట్ సినిమాలలో హీరోయిన్ గా నటించారు.
అయితే కన్నడలో స్టార్ యాక్టర్ అండ్ నిర్మాతగా అయిన మురళిగారి మరణం ఆమె జీవితంలో మర్చిపోలేని సంఘటన అని.అప్పుడు తాను పడ్డ బాధ అంత ఇంత కాదని ఆమె చాలాసార్లు చెప్పుకొచ్చారు.1982 లో నటుడిగా ప్రవేశించి 2010 వరకు నటించాడు యాక్టర్ మురళి.ఇక ఈయన నటించిన తమిళ చిత్రాలు తెలుగులో నవ వసంతం, హృదయం వంటివి విదుదలై.తెలుగునాట విశేష ఆదరణ పొందాయి.భగ్న ప్రేముకుడిగా ఈయన నటన అందరికి నచ్చుతుంది.

అంతేకాదు ఈయన సితార, రంభ, రోజా, సిమ్రాన్, రేవతి, మీనా, వంటి హీరోయిన్స్ తో నటించి తమిళ, కన్నడ మంచి పేరు సంపాదించుకున్నాడు.అయితే దురదృష్టవశాత్తు తన 40 వ ఏటా ఆయన హఠాత్తుగా మరణించారు హీరో మురలి.ఇక మురళికి సితార బాగా క్లోజ్ కావడంతో ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయిందట.అప్పుడు జీవితం అన్నది శాశ్వతం కాదని మనిషి అన్నాకా.మంచి పేరు తెచ్చుకొని ఉన్నన్నాళ్ళు హాయిగా బతకడమేనని సితారా చెప్తుంటుంది.

ఇక సితార గారికి ప్రెసెంట్ 47 సంవత్సరాలు కానీ సితారా గారు ఇంతవరకు పేళ్ళి చేసుకోలేదు ఈ విషయం ఇంతవరకు ఎవరికీ తెలిసి ఉండదు కూడా… పెళ్లి చేసుకోపోవడానికి గల కారణాన్ని కూడా సితార చాలా సార్లు చెప్పారు.వాళ్ళ నాన్నగారంటే సీతారకు చాల ఇష్టం.ప్రతి విషయంలోనూ ఆయన తనకు ఎంతో సపోర్ట్ గా నిలిచేవారట.
ఇంకా సితార చేసే ప్రతి పనుల్లో ఆయన్నే సలహాలు అడిగేదట.అలాంటి వ్యక్తి హఠాత్తుగా మరణించారని దాని తరువాత కొన్ని సంవత్సరాల పాటు సినిమాకి దూరమయ్యానని.
పెళ్లి కూడా చేసుకోబుద్ది కాలేదని దాని గురించి పెద్దగా ఆలోచించలేదంటూ చెప్పుకొచ్చింది.ఇక సితార 1990లో మనసు మమతా అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇప్పటికి నటిస్తుందంటే ఆమెకి సినిమా.
ఇల్లు తప్ప వేరే ప్రపంచమే లేదని మనం అర్ధం చేస్కోవచ్చు.