పిశాచి, మంత్రగత్తె అంటూ శృతి హాసన్ పై నెటిజన్ల ట్రోల్స్.. ఆమె ఏమన్నారంటే?

Actress Shruti Hassan Comments About Netizens Negative Trolls

సినిమా రంగానికి చెందిన వాళ్లపై కొన్ని సందర్భాల్లో నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతూ ఉంటాయనే సంగతి తెలిసిందే.కొంతమంది సెలబ్రిటీలు ఆ ట్రోల్స్ గురించి స్పందించడానికి ఇష్టపడితే మరి కొందరు సెలబ్రిటీలు మాత్రం ఆ ట్రోల్స్ గురించి అస్సలు మాట్లాడరు.

 Actress Shruti Hassan Comments About Netizens Negative Trolls-TeluguStop.com

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తెలుగులో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమాతో పాటు బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీతో బిజీగా ఉన్నారు.

సక్సెస్ లో ఉన్న స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో వరుసగా సినిమాలు చేస్తూ శృతి హాసన్ హీరోయిన్ గా సత్తా చాటుతున్నారు.

 Actress Shruti Hassan Comments About Netizens Negative Trolls-పిశాచి, మంత్రగత్తె అంటూ శృతి హాసన్ పై నెటిజన్ల ట్రోల్స్.. ఆమె ఏమన్నారంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కమల్ హాసన్ కూతురిగా శృతిహాసన్ సినిమాల్లోకి వచ్చినా కెరీర్ తొలినాళ్లలో సరైన సక్సెస్ లేక శృతి ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు.గబ్బర్ సింగ్ సినిమాతో శృతి హాసన్ కు స్టార్ హీరోయిన్ స్టేటస్ తో పాటు వరుస సినిమా ఆఫర్లు దక్కాయి.

శృతి హాసన్ మంచి సింగర్ అనే సంగతి తెలిసిందే.

Telugu Balkrishna, Gabbar Singh, Netizens Trolls, Pawan Kalyan, Shruti Hassan, Tollywood-Movie

శృతి హాసన్ పాడిన కొన్ని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు శృతి చేసిన ఆల్బమ్స్ కు మంచి పేరు వచ్చింది.మ్యూజిక్ పై ఉన్న ఆసక్తి వల్ల శృతి హాసన్ కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చిన తర్వాత నటనకు దూరంగా ఉన్నారు.సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే సమయంలో తనపై చాలా ట్రోల్స్ వచ్చాయని శృతి హాసన్ చెప్పుకొచ్చారు.

కొంతమంది తాను మంత్రగత్తె లా ఉన్నానని విమర్శలు చేశారని శృతి హాసన్ తెలిపారు.

మరి కొందరు తాను భయంకరంగా ఉన్నానని, పిశాచిలా ఉన్నానని కామెంట్లు చేశారని శృతి హాసన్ చెప్పుకొచ్చారు.తనను ఎవరికి నచ్చిన విధంగా వాళ్లు పిలుచుకోవచ్చని శృతి హాసన్ తెలిపారు.ఎవరైనా మంత్రగత్తె అని పిలిస్తే శక్తి వచ్చిన విధంగా అనిపిస్తుందని శృతి హాసన్ కామెంట్లు చేశారు.

తాను కామెంట్లను పెద్దగా పట్టించుకోకపోవడంతో కామెంట్లు చేసేవాళ్ల సంఖ్య తగ్గిందని శృతి అన్నారు.

#Balkrishna #Gabbar Singh #Pawan Kalyan #Shruti Hassan #Netizens Trolls

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube