కాటమరాయుడు తర్వాత శృతి గ్యాప్ తీసుకోవడానికి అసలు కారణమిదే?

సాధారణంగా సినిమా హీరోయిన్లు వరుసగా ఆఫర్లు వస్తున్న సమయంలో సినిమాల విషయంలో గ్యాప్ తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు.అయితే స్టార్ హీరోయిన్ శృతి హాసన్ మాత్రం మిగతా హీరోయిన్లకు భిన్నంగా కాటమరాయుడు సినిమా తర్వాత ఏకంగా రెండేళ్లు గ్యాప్ తీసుకున్నారు.

 Actress Shruti Hassan Comments About Gap In Career-TeluguStop.com

బాక్సాఫీస్ వద్ద కాటమరాయుడు సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదనే సంగతి తెలిసిందే.

తాజాగా ఒక సందర్భంలో శృతి నెటిజన్లతో ముచ్చటిస్తూ కాటమరాయుడు సినిమా తర్వాత గ్యాప్ తీసుకోవడానికి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 Actress Shruti Hassan Comments About Gap In Career-కాటమరాయుడు తర్వాత శృతి గ్యాప్ తీసుకోవడానికి అసలు కారణమిదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శృతి హాసన్ ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడతారనే విషయం తెలిసిందే.సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే శృతి ఫోటోలు, వీడియోలు షేర్ చేయడంతో పాటు తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

కాటమరాయుడు సినిమా తర్వాత గ్యాప్ ఎందుకు తీసుకున్నారో చెప్పాలని ఒక నెటిజన్ అడగగా తనకు తానే కావాలని ఆ గ్యాప్ తీసుకున్నానని ఆమె అన్నారు.

Telugu Gap In Career, Interesting Facts, Katamarayudu, Pan India Heroine, Pawan Kalyan, Salaar Movie, Shruthi Career Gap, Shruthi Movie Offers, Shrutihassan, Tollywood-Movie

తనను తాను మార్చుకోవాలనే ఆలోచనతో ఆ గ్యాప్ ను తీసుకున్నానని శృతి పేర్కొన్నారు.వర్క్ పై ఆసక్తి లేకుండా తాను గ్యాప్ తీసుకున్నానని అనుకోవద్దని శృతి హాసన్ చెప్పుకొచ్చారు.తనకు మ్యూజిక్ అంటే కూడా ఎంతో ఇష్టమని శృతి తెలిపారు.

Telugu Gap In Career, Interesting Facts, Katamarayudu, Pan India Heroine, Pawan Kalyan, Salaar Movie, Shruthi Career Gap, Shruthi Movie Offers, Shrutihassan, Tollywood-Movie

ప్రస్తుతం యాక్టింగ్ తో పాటు మ్యూజిక్ కు కూడా సమాన ప్రాధాన్యతను ఇస్తున్నానని ఒకప్పుడు మ్యూజిక్ పై పెద్దగా ఆసక్తి ఉండేది కాదని శృతి పేర్కొన్నారు.ఇటీవల లాభం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన శృతి సలార్ సినిమాతో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నారు.సలార్ మూవీతో శృతి పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపును సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సీనియర్ హీరోలకు జోడీగా శృతి హాసన్ సున్నితంగా రిజెక్ట్ చేస్తినట్టు తెలుస్తోంది.

#Shruthi Offers #Gap Career #Katamarayudu #Shrutihassan #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు