ఆంటీ లా ఉన్నావ్ అంటూ హీరోయిన్ ని కామెంట్ చేసిన నెటిజన్...

తెలుగులో టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ హీరోగా నటించినటువంటి జూనియర్స్ అనే చిత్రంలో హీరోయిన్ గా ఆడి పాడినటువంటి ముద్దుగుమ్మ షెరీన్ అందరికీ బాగానే గుర్తుంటుంది.అయితే ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడమే కాకుండా షెరీన్ నటనకి కూడా సినీ విమర్శకుల నుంచి మంచి విమర్శలే అందుకుంది.

 Sherin, Tollywood Heroine, Kollywood, Danger, Jumiours Movie, Allari Naresh, Abu-TeluguStop.com

ఆ తరువాత డేంజర్ అనే చిత్రంలో అవకాశం దక్కించుకుంది.ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

దీంతో అమ్మడికి అవకాశాలు కరువయ్యాయి.

అయితే ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అందుబాటులో ఉంటుంది.

అయితే తాజాగా ఈ అమ్మడు అభిమానులతో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించింది.ఇందులో భాగంగా పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.అయితే ఓ నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో లోకి అడుగు పెట్టక ముందు ఆంటీ లాగా ఉండే దానివని ఈ మధ్యకాలంలో బాగా యంగ్ గా కనిపిస్తున్నావ్ అంటూ కామెంట్ చేశాడు.

దీంతో షెరీన్ కూడా తనదైన శైలిలో రిప్లై ఇస్తూ అవును కొంతమంది మన రూపాన్ని చూసి మనసుకు బాధ కలిగించేలా కామెంట్లు చేస్తారని కానీ మనం ఆత్మ అభిమానం ఉన్న మనుషులని గుర్తుంచుకుంటే బాగుంటుందని రిప్లై ఇచ్చింది.

దీంతో కొందరు నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.మరికొంతమంది మాత్రం కేవలం అవుట్ లుక్ చూసి  వారిపై ఇలాంటి కామెంట్లు చేసే వారికి సరిగ్గా బుద్ధి చెప్పవంటూ షెరీన్ ని  అభినందిస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో కొత్త చిత్రాలకి సంబంధించినటువంటి అవకాశాలు ఏమీ లేవు.దీంతో ఈ అమ్మడు ప్రస్తుతం ఖాళీగా గడుపుతోంది.

దీంతో ఈ అమ్మడు ఇటీవలే బిగ్ బాస్ షో లో కూడా పాల్గొంది.అలాగే ఓ ప్రముఖ ఛానల్ నిర్వహిస్తున్న టువంటి డాన్స్ సూపర్ స్టార్స్  అనే షో కి జడ్జిగా వ్యవహరిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube