ఇండియాలోని ఈ టాప్ చాక్లెట్ కంపెనీ కి ఫౌండర్…ఒకప్పటి ఆ టాప్ తెలుగు హీరోయిన్.! ఎవరో తెలుసా.?

సినిమాలపై మక్కువ తోనో.నిజజీవితంలో ఉన్న కష్టాల కడలిని ఈదలేక ఒక్క అవకాశం ఇస్తే తామేంటో నిరూపించుకుంటాం అనుకునేవారూ చాలామంది సినిమాలవైపు మొగ్గు చూపుతారు.

 Actress Sharada The Founder Of Lotus Chocolate Company-TeluguStop.com

ఒకసారి ఇండస్ట్రీలోకి వచ్చాక అవకాశాలు కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతుంటే వ్యక్తిగత జీవితం గురించి కూడా మర్చిపోతారు.ఇలాంటి వారి గురించి ఎన్నో ఉదాహరణలు చెప్పొచ్చు.

సినిమా జీవితం సాఫీగా సాగిపోతున్న వ్యక్తిగత జీవితం నరకప్రాయమైన నటులు ఎందరో.వాళ్లల్లో ఒకరే ఊర్వశి శారద.

శారద అసలు పేరు సరస్వతి దేవి.చిన్నతనం నుంచి భరత నాట్యం నేర్చుకున్న శారదకు కొన్ని నాటకాల్లో నటించింది.వీరి కుటుంబాల్లో ఇలాంటి వాటికి అంగీకరించరు.ఆడపిల్లలకు 14 ఏళ్లకే పెళ్ళి చేసేస్తారు.కానీ ఈమె ఆసక్తి, ప్రతిభ చూసి వీళ్ళఅమ్మ ధైర్యం చేసి పంపించింది.ఇది నచ్చక వీరితో మూడేళ్ల పాటు ఎవరూ మాట్లాడలేదట కూడా.

తర్వాత నెమ్మదిగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ టాప్ హీరోయిన్ గా ఎదిగింది.ఎన్టీయార్,ఏయన్నార్,క్రిష్ణ లాంటి అందరి నటుల సరసన నటించింది.

శోభన్ బాబు,శారద జంట అప్పట్లో హిట్ పెయిర్.పోలీస్ ఆఫీసర్ గా ,న్యాయవాదిగా,జడ్జిగా శారద కరెక్ట్ గా సరిపోయేది.

మళయాళంలో కూడా శారదకు మంచి గుర్తింపు ఉంది.కేరళ ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక ఊర్వశి అవార్డుని మూడు సార్లు అందుకున్న శారద ” ఊర్వశి శారద “గానే సుపరిచితం.

సినిమా జీవితం సాఫీగా సాగినప్పటికీ వ్యక్తిగత జీవితంలో శారదకు కష్టాలు తప్పలేదు.అలనాటి హాస్యనటుడు చలం ని పెళ్లిచేసుకున్న శారదకు ఏనాడు సుఖంలేదు.శారదతో పెళ్లినాటికే చలం కి పెళ్లి జరిగి ముగ్గురు పిల్లలున్నారు.చలంతో పెళ్లి వద్దని ఎందరు వారించినా వినకుండా శారదే ఇష్టంతో పెళ్లిచేసుకుంది.కానీ ఆ తర్వాత అతడితో జీవితంలో నరకాన్ని చవిచూసింది.విడాకులు తీసుకుని మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంది.

రాజకీయాల్లోకి అడుగుపెట్టింది.అప్పట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తెనాలి పార్లమెంటు సీటుకు పోటీ చేసి ప్రస్తుత జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సింగం బసవపున్నయ్యపై గెలిచారు.

పార్లమెంటు సభ్యురాలిగా ఉన్న కాలములో తన నియోజక వర్గానికి రైల్వే లైనును మంజూరు అయ్యేలా చేసింది.రోడ్లు మరియు పాఠశాలలు కట్టించింది.

అయితే రెండేళ్లకే అప్పట్లో లోక్‌సభ రద్దు కావడంతో తిరిగి 1998వ సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి.రెండవ పర్యాయం లోక్‌సభకు పోటీచేసినప్పుడు పి శివశంకర్‌ పై ఓడిపోయింది.

ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వైవాహిక జీవితంలో కష్టాలు చూసాక పిల్లలు వద్దనుకుని తన అన్న మోహన్ రావు పిల్లల్నే తన పిల్లలుగా చూసుకుంది శారద.ఆ తర్వాత సోధరుడితో (విజయరాఘవన్) కలిసి ఒక ఛాక్లెట్ కంపెనీని స్థాపించింది.కేవలం స్త్రీలకు ఉపాది కల్పించాలనే ఉద్దేశముతో లోటస్ చాక్‌లేట్ల వ్యాపారాన్ని ప్రారంభించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube