స్లిమ్ అయిన అర్జున్ రెడ్డి భామ.. బాలీవుడ్ కోసమే

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన అందాల భామ షాలినీ పాండే.ఈ అమ్మడు మొదటి సినిమాతోనే ఎక్కడలేని క్రేజ్ ని సొంతం చేసుకుంది.

 Actress Shalini Pandey Recent Photos Goes Viral, Arjun Reddy, Tollywood, Bollywo-TeluguStop.com

అర్జున్ రెడ్డి సినిమాలో నటిగా, అలాగే ఇంటిమేంట్ సన్నివేశాలలో అస్సలు మొహమాటం లేకుండా నటించి తాను ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసేస్తానని ప్రూవ్ చేసుకుంది.థియేటర్ ఆర్ట్స్ నుంచి సినిమాలలోకి అడుగుపెట్టడం షాలినీ పాండేకి ఉన్న ప్లస్ పాయింట్.

ఇక అర్జున్ రెడ్డి సినిమా తర్వాత స్టార్ హీరోయిన్ అయిపోతుందని అందరూ భావిస్తే అనూహ్యంగా తెలుగులో ఆమె చాలా తక్కువ సినిమాలకే పరిమితం అయ్యింది.అది కూడా చిన్న హీరోల సినిమాలలోనే అవకాశాలు వచ్చాయి.

కళ్యాణ్ రామ్ లాంటి కమర్షియల్ హీరోతో సినిమా చేసిన అది వర్క్ అవుట్ అవ్వలేదు.తరువాత ఉన్న ఆ కొద్ది అవకాశాలు కూడా టాలీవుడ్ లో షాలిని పాండే కి తగ్గిపోయాయి.
అయితే టాలీవుడ్ లో మరి లాభం లేదనుకొని ఈ అమ్మడు ముంబై చెక్కేసింది.బొద్దుగుమ్మగా ఉండటం కూడా ఈమెకి అవకాశాలు తగ్గడానికి ఒక కారణం అని చెప్పాలి.

ఈ నేపధ్యంలో బొద్దుగుమ్మగా ఉండే షాలినీ వర్క్ ఔట్స్ చేసి కంప్లీట్ ఫిట్ గా స్లిమ్ లుక్ లోకి మారిపోయింది.తాజాగా స్లిమ్ లుక్ లో ఆమె చేయించుకున్న ఫోటోషూట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఆ ఫోటోలు కాస్తా వైరల్ అయ్యాయి.బొద్దుగుమ్మ ఇంత ముద్దుగా బార్బీడాల్ లా ఎలా మారిపోయిందా అని అందరూ ఆశ్చర్యంగా చర్చించుకోవడం విశేషం.

ప్రస్తుతం రణవీర్ సింగ్ తో ఈ అమ్మడు ఒక సినిమాలో నటిస్తుంది.ఈ సినిమా మీద ఎక్కువ హోప్స్ పెట్టుకుంది.

ఈ సినిమా కోసమే ఇలా స్లిమ్ లుక్ లోకి మారిపోయిందని టాక్ వినిపిస్తుంది.లుక్ మార్చిన తర్వాత అయిన ఈ భామకి అవకాశాలు పెరుగుతాయేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube