తన కూతురిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్న షకీలా...

ఒకప్పుడు తన సినిమాలతో స్టార్ హీరోల చిత్రాలకు సైతం గట్టిపోటీ ఇచ్చిన ప్రముఖ నటి “షకీలా” గురించి సౌత్ ఇండియాలో తెలియనివారుండరు.అయితే నటి షకీలా అప్పట్లో శృంగార తరహా చిత్రాలలో నటించి బాగానే గుర్తింపు తెచ్చుకుంది.

 Actress Shakeela Want To Introduce Her Daughter As Heroine In Film Industry-TeluguStop.com

కానీ క్రమక్రమంగా “వయసు మీద పడటంతో” షకీలా సినిమాలకు ఆదరణ తగ్గిపోయింది.దీంతో ఒకానొక సమయంలో రోజుకి లక్షల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్న షకీలా ప్రస్తుతం ఆర్థిక పరమైన సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

దీనికి తోడు ఆ మధ్య షకీలా నిర్మాతగా వ్యవహరించి తెరకెక్కించిన చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోక పోవడంతో ఈ ఆర్థిక పరమైన సమస్యలు మరింత ఎక్కువయ్యాయి.దీంతో ఇటీవలే ఓటిటి ప్లాట్ ఫారమ్ బిజినెస్ లోకి షకీలా అడుగు పెట్టింది.

 Actress Shakeela Want To Introduce Her Daughter As Heroine In Film Industry-తన కూతురిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్న షకీలా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఆ మధ్య షకీలా “మిల” అనే ఓ ట్రాన్స్ జెండర్ ని దత్తత తీసుకుంది.దీంతో మిల ని హీరోయిన్ గా పరిచయం చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తోంది.

ఇప్పటికే మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ దర్శకుడితో మిల హీరోయిన్ ఎంట్రీ గురించి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

అయితే ఈ విషయం ఇలా ఉండగా షకీలా కేవలం బి గ్రేడ్ తరహా చిత్రాల్లో మాత్రమే కాకుండా పలు టాలీవుడ్, కోలీవుడ్, మల్లు వుడ్, చిత్రాలలో కామెడీ పాత్రలలో కూడా నటించింది.కానీ పారితోషికం విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో పెద్దగా సంపాదించుకోలేక పోయింది.అంతేకాక అప్పట్లో పలు చిత్రాల్లో నటించగా వచ్చిన రెమ్మ్యూనరేషన్ ని తన కుటుంబ సభ్యుల చేతిలో పెట్టడంతో కొందరు కుటుంభ సభ్యులు దారుణంగా మోసం చేసినట్లు అప్పట్లో షకీలా పలు ఆరోపణలు కూడా చేసింది.

#ShakeelaGrade #Mila #Shakeela #ActressShakeela #Actress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు