నాలా ఎవరూ మోసపోకండి.. షకీలా సంచలన వ్యాఖ్యలు..?

శృంగార తారగా దక్షిణాది భాషలన్నింటిలో గుర్తింపు తెచ్చుకున్న షకీలా జీవితం ఆధారంగా “షకీలా” పేరుతోనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.ఇంద్రజిత్ లంకేశ్ డైరెక్షన్ లో రిచా చద్దా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా షకీలా జీవితంలో ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలు వెలుగులోకి రానున్నాయి.

 Actress Shakeela Interesting Comments About Her Biopic, Shakeela, Shakeela Biopi-TeluguStop.com

ఎన్నో లో బడ్జెట్ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న షకీలా కెరీర్ లో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు.

షకీలాకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా ఒక మంచి సందేశాన్ని కూడా ఇవ్వనున్నారని సమాచారం.

ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న షకీలా ప్రస్తుతం విద్యను అభ్యసిస్తూ సినిమా రంగంలోకి అడుగు పెట్టబోయే యువతకు తనలా మోసపోవద్దని ఆమె సూచించారు.బ్రతిపడకుండానే తన బయోపిక్ తెరకెక్కుతోందని అయితే ప్రమోషన్స్ లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాల గురించి తాను మాట్లాడనని ఆమె అన్నారు.

Telugu Actressshakeela, Richa Chadha, Shakeela, Shakeela Biopic, Shakeela Story-

ప్రతి మనిషి జీవితంలో కష్టాలు, బాధలు ఉంటాయని.కొన్ని బాధలను ఇతరులకు చెప్పుకోకపోవడం వల్ల వాళ్లు మన గురించి తప్పుగా అనుకునే అవకాశాలు కూడా ఉంటాయని అన్నారు.సినీ రంగంలోకి అడుగు పెడుతున్న యువతులు తాను చేసిన తప్పులను మాత్రం చేయవద్దని.మహిళలను దృష్టిలో పెట్టుకుని వాళ్లకు మంచి సందేశం ఇచ్చే విధంగా ఈ చిత్రం తెరకెక్కుతోందని త్వరలో ఈ సినిమా విడుదల కాబోతుందని షకీలా చెప్పారు.

గతంలో సొంత సిస్టర్ తనను మోసం చేసిందని షకీలా పలు సందర్భాల్లో చెప్పారు.నిర్మాతలకు తన సినిమాల ద్వారా భారీ లాభాలు వచ్చేలా చేసిన షకీలా ఆర్థికంగా కూడా స్థిరపడకపోవడం గమనార్హం.

అయితే షకీలా బయోపిక్ ద్వారా ఏఏ విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube