పిల్లల్ని కనడానికి లైసెన్స్ కావాలి అంటున్న హీరోయిన్     2016-12-24   04:29:05  IST  Raghu V

రోడ్డు మీద బండి నడపాలంటే లైసెన్సు కావాలి. ప్రాడక్ట్స్ ఇంపోర్ట్స్, ఎక్స్ పోర్ట్స్ చేయాలన్న లైసెన్సు కావాల్సిందే. అలాగే పిల్లల్ని కనడానికి కూడా లైసెన్సు ఉండాల్సిందే అంటోంది బుజ్జిగాడు హీరోయిన్ సంజన. పెరెంటింగ్ లైసెస్స్ ని ఖచ్చితంగా ప్రవేశపెట్టాల్సిందే అని ప్రధానమంత్రి నరేంద్ర మోడిని రిక్వెస్ట్ చేసింది ఈ భామ.

ఇలా ఎందుకు అడుగుతోంది? ఈ కొత్తరకమైన డిమాండ్ ఎందుకు మీకు కాస్త కంన్ప్యూజింగ్ గా ఉంది అనుకుంటా. సంజన పూర్తి అర్థరహితంగా ఏం మాట్లాడులేదు లేండి.

రోడ్డు మీద భిక్షాటన చేసే ఆనాథ పిల్లలు, పనులు చేసుకునే బాలకార్మికులను చూస్తే సంజన మనసుకి బాధగా అనిపిస్తుందట. వారిని పోషించలేని తల్లిదండ్రులపై కోపం వేస్తుందట. అందుకే పోషించే అర్హత ఉన్నవారికి మాత్రమే పిల్లలని కనేందుకు లెస అనుమతించాలని, పెరెంటల్ లైసెన్స్ పొందినవారే పిల్లల్ని కనాలని అంటోంది.