అమ్మాయిలతో శృంగార రాకెట్ నడుపుతూ ఆ సీనియర్ నటి అరెస్ట్..! ఆమె సీరియల్స్ లో కూడా.!       2018-06-04   23:10:21  IST  Raghu V

గుట్టుచప్పుడు కాకుండా కొంతమంది అమ్మాయిలతో సెక్స్ రాకెట్‌ను నడుపుతోన్న తమిళ సీనియర్ నటి సంగీత బాలన్ అడ్డంగా దొరికిపోయారు.చెన్నైలోని పనయూర్‌లోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో అమ్మాయిలతో వ్యభిచారాన్ని నడుపుతున్న ఆమెను పోలీసులు అరెస్ట్ చేసారు.

వ్యభిచారం చేస్తోన్న అమ్మాయిలు వేర్వేరు రాష్ట్రాలకు చెందినవారని, ముఖ్యంగా వీరిలో ఉత్తరాదికి చెందినవారే ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈస్ట్ కోస్ట్ రోడ్‌లో ఉన్న రిసార్ట్‌లో వ్యభిచారం జరుగుతోందని చెన్నై పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ రిసార్ట్‌పై ఆకస్మిక దాడులు చేసి సంగీతతో పాటు ఆమెకు సహకరిస్తోన్న సురేష్ అనే వ్యక్తిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అమ్మాయిలందరిని పునరావాస కేంద్రానికి తరలించారు.

సంగీత బాలన్ 1996లో వచ్చిన తమిళ చిత్రం ‘కరుప్పు రోజా’ ద్వారా తెరంగేట్రం చేశారు. ఆ తరవాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించారు. ఈ మధ్య కాలంలో టీవీ సీరియళ్ల ద్వారా ఆమె బాగా పాపులర్ అయ్యారు. అలాగే వల్లి, పిళ్లై నిలా, అవల్ (విజయ టీవీ), చెల్లామే (సన్ టీవీ), అన్నకొడియుమ్ ఎయింధు పెంగలుమ్, సబిత అల్లీస్ సభాపతి వంటి టీవీ షోలలోనూ సంగీత పాల్గొన్నారు. ప్రస్తుతం రాధికా శరత్ కుమార్‌తో కలసి ‘వాణి రాణి’ అనే టీవీ సీరియల్‌లో సంగీత నటిస్తున్నారు. ఈ సీరియల్‌లో రాధికా, సంగీత అక్కచెల్లెళ్లుగా కనిపిస్తున్నారు.