అన్నపూర్ణ స్టూడియోస్‌ను దక్కించుకున్న సమంత     2018-07-16   11:24:09  IST  Sai Mallula

టాలీవుడ్‌లో అన్నపూర్ణ స్టూడియోస్‌కు మంచి పేరు ఉంది. సిటీ మద్యలో ఉన్న అన్నపూర్ణ స్టూడియోలో ప్రతి రోజు పదు సంఖ్యలో చిత్రాల షూటింగ్స్‌ జరుపుకుంటూ ఉంటాయి. ఇక పెద్ద ఎత్తున సీరియల్స్‌ మరియు రియాల్టీ షోల చిత్రీకరణ కూడా జరుపుకుంటున్నాయి. ప్రతి రోజు లక్షల్లో ఆదాయం కలిగి ఉండే ఈ అన్నపూర్ణ స్టూడియో అక్కినేని కుటుంబంది అనే విషయం తెల్సిందే. తెలుగు సినిమా పరిశ్రమ అప్పట్లో చెన్నైలో ఉండేది. ఎన్టీఆర్‌ ఆహ్వానం మేరకు హైదరాబాద్‌కు వచ్చి, అక్కినేని నాగేశ్వరరావు ఈ స్టూడియోను నిర్మించడం జరిగింది. కాల క్రమేనా ఈ స్టూడియో అభివృద్ది చెందుతూ వచ్చింది. భారీ ఎత్తున ఫ్లోర్స్‌ రెడీ చేయడంతో పాటు, ఇండోర్‌ మరియు ఔట్‌ డోర్‌ యూనిట్‌కు మంచి అవకాశం అన్నపూర్ణ స్టూడియోలో ఉంది.

Actress Samantha To Involve In Annapurna Studio Activities-

Actress Samantha To Involve In Annapurna Studio Activities

అన్నపూర్ణ స్టూడియోను ఇంత కాలం అక్కినేని నాగార్జున మరియు సుమంత్‌ సోదరి మెయింటెన్‌ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో అత్యధిక వాటాను అక్కినేని నాగచైతన్య దక్కించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సమంత కోరిక మేరకు చైతూ అన్నపూర్ణ స్టూడియోలో మెజార్టీ వాటాను కొనుగోలు చేయడం జరిగింది అంటూ సమాచారం అందుతుంది. ఇటీవలే అక్కినేని ఫ్యామిలీ ఆస్తుల వాటాలు వేయడం జరిగిందని, అందులో అన్నపూర్ణ స్టూడియోను 60 శాతం ఒక నాగచైతన్య తీసుకుని మిగిలిన 40 శాతం వాటాను అక్కినేని ఫ్యామిలీ సభ్యులందరికి ఉండేలా కేటాయించడం జరిగింది.

అన్నపూర్ణ స్టూడియోను దక్కించుకున్న నాగచైతన్యకు అక్కినేని ఇతర ఆస్తులో వాటాలు ఉండే అవకాశం ఉండదు. అక్కినేని వెంకట్‌ మరియు నాగార్జును కూడా గత కొంత కాలంగా ఉమ్మడి వ్యాపారం చేస్తున్నారు. వారు కూడా తాజాగా విడిపోయినట్లుగా తెలుస్తోంది. నాగార్జున హీరోగా నటిస్తూనే పలు వ్యాపారాల్లో భాగస్వామ్యంగా ఉంటున్నాడు. గత కొంత కాలంగా అంతా కలిసి వ్యాపారాలు చేస్తున్న అక్కినేని ఫ్యామిలీ ఇప్పుడు విడిపోయి వ్యాపారాలు చేయాలని నిర్ణయించుకున్నారు. నాగచైతన్య మరియు సమంతలు కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ను దక్కించుకున్నారు. వీరిద్దరు కూడా సినీ రంగంలోనే ఉండటం వల్ల ఖచ్చితంగా అన్నపూర్ణ స్టూడియోను మరింతగా అభివృద్ది చేస్తారనే నమ్మకం వ్యక్తం అవుతుంది. అన్నపూర్ణ స్టూడియోలో నిర్మితం అయ్యే ప్రతి ఒక్క సినిమాకు వీరిద్దరు ఇకపై ఎక్కువగా ప్రచారం చేయబోతున్నారు.