ఆ బిజినెస్ లోకి సమంత ఎంట్రీ... షాక్ లో అభిమానులు?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.ఇతర హీరోయిన్లలాగే వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది.

 Akkineni Samantha New Clothing Business Saaki World,actress Samantha Akkineni, N-TeluguStop.com

ఇతర హీరోయిన్లు జిమ్ లు, నగల దుకాణాలపై ఆసక్తి చూపిస్తే సమంత మాత్రం వారికి భిన్నంగా బట్టల వ్యాపారంలోకి అడుగు పెట్టడం గమనార్హం.తాజాగా ట్విట్టర్ ద్వారా సామ్ అభిమానులకు కీలక విషయాలను వెల్లడించింది.

సాకీ వరల్డ్ పేరుతో బట్టల వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నానని సామ్ ప్రకటించింది.

త్వరలో సాకీ వరల్డ్ పేరుతో నూతన ఔట్ లెట్ ప్రారంభం కానుందని సామ్ పేర్కొంది.

ఎవరైనా సమంత బట్టల వ్యాపారంలోకి అడుగు పెడుతుందంటే కళ్లు చెదిరే ధరలు ఉంటాయని అనుకుంటారు.అయితే ధరల విషయంలో మాత్రం అభిమానులు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని… సామాన్యులకు సైతం అందుబాటు ధరల్లోనే సాకీ వరల్డ్ మీ ముందుకు రాబోతుందని సామ్ తెలిపింది.

సాకీ వరల్డ్ ఫ్యాషన్ పట్ల తన ఇష్టాన్ని తెలిపే విధంగా ఉంటుందని ఆమె పేర్కొంది.గత కొన్ని నెలలుగా ఈ వ్యాపారంలోకి అడుగు పెడదామని తాను అనుకుంటున్నానని ఆమె వెల్లడించింది.

ప్రతి ఒక్కరూ సాకీ వరల్డ్ ను ఇష్టపడతారనే నమ్మకం తనకు ఉందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసిన సమంత ఏ మాయ చేశావె సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

తొలి సినిమాతోనే హిట్ ను ఖాతాలో వేసుకున్న సామ్ ఆ తరువాత వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే నాగచైతన్యను పెళ్లి చేసుకున్న సమంత పెళ్లి తరువాత కూడా వరుస విజయాలు సొంతం చేసుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube