నా బ్యూటీ సీక్రెట్ ఇదే.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన సాయిపల్లవి!

న్యాచురల్ బ్యూటీగా పేరును సొంతం చేసుకున్న సాయిపల్లవి లవ్ స్టోరీ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు.తెలుగుతో పాటు తమిళంలో కూడా సాయిపల్లవి చేతిలో ఆఫర్లు ఉన్నాయనే సంగతి తెలిసిందే.

 Actress Saipallavi Interesting Comments About Beauty Secrets-TeluguStop.com

తమిళమ్మాయి అయినప్పటికీ తెలుగులో కోట్ల సంఖ్యలో సాయిపల్లవికి అభిమానులు ఉన్నారు.ఫిదా సినిమాలోని వచ్చిందే, మారి 2 సినిమాలోని రౌడీ బేబీ, లవ్ స్టోరీ సినిమాలోని సారంగదరియా పాటలు సాయిపల్లవికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి.

అయితే సాయిపల్లవి బ్యూటీ సీక్రెట్స్ మాత్రం అభిమానులకు పెద్దగా తెలియవు.తనను న్యాచురల్ బ్యూటీ అని ప్రేక్షకులు పిలవడానికి సైతం అసలు కారణాలను సాయిపల్లవి వెల్లడించారు.కృత్రిమంగా తయారు చేసిన సబ్బులు, షాంపూలను తాను అస్సలు వినియోగించనని సాయిపల్లవి చెప్పుకొచ్చారు.తల వెంట్రుకల కొరకు, శరీర సంరక్షణ కొరకు న్యాచురల్ గా తయారు చేసిన వాటిని మాత్రమే తాను వాడతానని సాయిపల్లవి చెప్పుకొచ్చారు.

 Actress Saipallavi Interesting Comments About Beauty Secrets-నా బ్యూటీ సీక్రెట్ ఇదే.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన సాయిపల్లవి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమా షూటింగ్ లో పాల్గొనే సమయంలో సైతం జుట్టుకు కలర్ వేయించుకోనని సాయిపల్లవి పేర్కొన్నారు.

Telugu Actress Sai Pallavi, Beauty Secrets, Interesting Comments, Love Story Movie, Netizens Opinion, Sai Pallavi Beauty Secrets, Sai Pallavi Food Habits, Saipallavi, Shyam Singha Roy, Virata Parvam-Movie

తన వెంట్రుకల వల్లే తాను మరింత అందంగా కనిపిస్తున్నానని సాయిపల్లవి చెప్పుకొచ్చారు.తాను పరిమితంగా ఆహారం తీసుకోవడంతో పాటు తప్పనిసరిగా ఆహార నియమాలను పాటిస్తానని సాయిపల్లవి కామెంట్లు చేశారు.ఆరోగ్యకరమైన ఆహారంను మాత్రమే తాను తీసుకుంటానని ఆమె చెప్పుకొచ్చారు.

Telugu Actress Sai Pallavi, Beauty Secrets, Interesting Comments, Love Story Movie, Netizens Opinion, Sai Pallavi Beauty Secrets, Sai Pallavi Food Habits, Saipallavi, Shyam Singha Roy, Virata Parvam-Movie

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని సాయిపల్లవి కామెంట్లు చేశారు.అందరు హీరోయిన్లకు భిన్నంగా సాయిపల్లవి బ్యూటీ సీక్రెట్స్ ఉండటం గమనార్హం.సాయిపల్లవి కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.లవ్ స్టోరీ సక్సెస్ తో సాయిపల్లవికి ఆఫర్లు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.సాయిపల్లవి సినిమాల ఎంపిక కూడా బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.సాయిపల్లవి నటించిన విరాటపర్వం, శ్యామ్ సింగరాయ్ రిలీజ్ డేట్లు ఫిక్స్ కావాల్సి ఉంది.

#Love Story #Virata Parvam #Netizens #ActressSai #Saipallavi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు