టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి( Heroine Sai Pallavi ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సాయి పల్లవి పేరు వినగానే ముందుకు గుర్తుకు వచ్చేది ఆమె నేచురల్ అందం ఆమెకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్.
ఈమెకు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.కాగా సాయి పల్లవి సెలక్టీవ్ గా సినిమాలు చేస్తూ, కేవలం నటనకు ప్రాధాన్య పాత్రలనే ఎంచుకుంటూ, గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వస్తోంది.
రానా సరసన గార్గీ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా తర్వాత సాయి పల్లవి మరే సినిమాలోను నటించలేదు.

దాంతో సాయి పల్లవి సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసిందని పెళ్లి చేసుకోబోతుందని ఇలా రకరకాల వార్తలు వినిపించినప్పటికీ సాయి పల్లవి మాత్రం ఆ వార్తలపై స్పందించలేదు.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో సాయి పల్లవి కి సంబంధించిన ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.సాయి పల్లవికి ఆథ్యాత్మిక చింతన( Spirituality ) ఎక్కువన్న విషయం తెలిసిందే.భక్తి కార్యక్రమాలు( Devotional Programs ), దేవాలయాలను సందర్శిస్తూ ఉంటుంది.కాగా తాజాగా ఒక తమిళ ఆన్‌లైన్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి ఆ సీక్రెట్‌ని బయట పెట్టింది.ఈ సందర్భంగా సాయి పల్లవి మాట్లాడుతూ.
తనకు విభూతి తినే అలవాటు ఉందని తెలిపింది.

అందుకే విభూతిని ఎప్పుడూ తన సంచిలో ఉంచుకుంటుందట.తినాలనిపించినప్పుడల్లా విభూదిని( Vibuthi ) కొద్దిగా తింటుందట.అయితే సాయిపల్లవి తినే విభూది మామూలు విభూది కాదు.
దాన్ని ప్రత్యేకమైన చెట్టుతో తయారు చేస్తారట.అంతేకాకుండా హీరోయిన్ తినే విభూది మంచి రుచిగా ఉంటుందని సాయి పల్లవి తెలిపింది.
అయితే సాయిపల్లవికి ఉన్న విచిత్రమైన అలవాటు తెలిసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.కొందరైతే ఆమె భక్తురాలిగా చూస్తున్నారు.
మరికొందరు ఆమెలోని సింప్లిసిటీని గురించి కామెంట్స్ పెడుతున్నారు.