వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు స్పష్టం చేసిన రేణు దేశాయ్  

Actress Renu Desai Re Entry With Web Series, Tollywood, Telugu Cinema, Pawan Kalyan, Renu Desai, OTT Platform - Telugu Actress Renu Desai Re Entry With Web Series, Ott Platform, Pawan Kalyan, Renu Desai, Telugu Cinema, Tollywood

పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా కంటే నటిగా, యాక్టివిస్ట్ గా రేణు దేశాయ్ కి ఉన్న గుర్తింపు ఎక్కువ.పవన్ కళ్యాణ్ పిల్లలకి తల్లిగా సింగిల్ మదర్ గా తన బాధ్యతలని చక్కగా నిర్వహిస్తూనే సొసైటీలో ఒక పవర్ ఫుల్ విమెన్ గా ఆమె తనని తాని రిప్రజెంట్ చేసుకుంటుంది.

TeluguStop.com - Actress Renu Desai Re Entry With Web Series

బద్రీ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్ పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ భావించారు.అయితే ఊహించని విధంగా ఆమె సినిమాలకి పూర్తిగా దూరమైంది.

పవన్ కళ్యాణ్ తో సహజీవనం చేసింది. బద్రీ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ పవన్ కళ్యాణ్ తోనే జానీ సినిమాలో నటించింది.

TeluguStop.com - వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు స్పష్టం చేసిన రేణు దేశాయ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఆ సినిమాలో రేణు దేశాయ్ నటనకి మంచి మార్కులు పడ్డాయి.ఆ తరువాత పవన్ ని పెళ్లి చేసుకోవడంతో పూర్తిగా సినిమాలకి దూరం అయ్యింది.

అయితే పెళ్లి తర్వాత ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయారు.విడాకులు తీసుకొని ఆమె లక్నో వెళ్ళిపోయింది.

అక్కడ మరల సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మరాఠీలో ఓ సినిమాకి దర్శకత్వం వహించింది.
ఇదిలా ఉంటే తెలుగులో రైతుల కాన్సెప్ట్ తో సినిమా చేయడానికి చాలా రోజుల నుంచి రేణు దేశాయ్ ఎదురుచూస్తుంది.

మంచి పాత్రలు దొరికితే సినిమాలలో నటించడానికి కూడా ఒకే అని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో రేణు చెప్పుకొచ్చింది.ఇదే సమయంలో వీలైనంత ఎక్కువగా టాలీవుడ్ కి దగ్గరగా ఉండేందుకు హైదరాబాద్ కి వచ్చి పోతూ ఉంది.

ఇక రేణు దేశాయ్ చెప్పినట్లుగానే మరల నటిగా ఎంట్రీ ఇచ్చేనందుకు రెడీ అయ్యింది.అయితే ఈ సారి వెబ్ సిరీస్ ద్వారా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతుంది.

ఏకంగా 18 ఏళ్ల తర్వాత మరల ముఖానికి రంగు వేసుకుంటుంది.ఈ విషయాన్ని రేణు దేశాయ్ అఫీషియల్ గా ధ్రువీకరించింది.

మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నాను.ఓ అందమైన వెబ్‌ సిరీస్‌లో చేసేందుకు సైన్‌ చేశానని చెప్పడానికి సంతోషంగానూ, అలాగే ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను.

అక్టోబర్‌లో షూటింగ్‌ ప్రారంభం కానున్న ఈ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను కొద్ది రోజుల్లో తెలియజేస్తాను.ఈ వెబ్ సిరీస్ ఎమ్‌.

ఆర్‌.కృష్ణ మామిడాల దర్శకత్వంలో తెరకెక్కుతుంది అని తన ఇన్స్టాగ్రామ్ లో రేణు దేశాయ్ పోస్ట్ చేసింది.

#Pawan Kalyan #Renu Desai #ActressRenu #OTT Platform

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actress Renu Desai Re Entry With Web Series Related Telugu News,Photos/Pics,Images..