అప్పట్లో సినిమా చేద్దాం అన్నారు ఇప్పటికి ఆ హీరో నాకు ఫోన్ చెయ్యలేదంటున్న హీరోయిన్!

సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు కేవలం తొలి పరిచయాలతోనే స్టార్ డమ్ ను సొంతం చేసుకుంటారు.ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుని ఓ రేంజ్ లో దూసుకుపోతారు.

 Actress Rekha Vedavyas About Nagarjuna Not Called Me Yet For Doing A Movie-TeluguStop.com

కానీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండలేకపోతారు.కారణాలు ఏవైనా ఉండొచ్చు కానీ ఒకేసారి సినిమాలకు దూరం అయితే మాత్రం తిరిగి మళ్లీ అలాంటి హోదాను సంపాదించడానికి సమయం పడుతుంది అని చెప్పాలి.

అలా ఎంతోమంది నటీనటులు అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీ నుండి వెళ్లిపోగా.అందులో ఒకరు రేఖ వేదవ్యాస్.

 Actress Rekha Vedavyas About Nagarjuna Not Called Me Yet For Doing A Movie-అప్పట్లో సినిమా చేద్దాం అన్నారు ఇప్పటికి ఆ హీరో నాకు ఫోన్ చెయ్యలేదంటున్న హీరోయిన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈమె ఈ తరానికి చెందిన హీరోయినే కానీ అప్పట్లో కెరీర్ మొదట్లో మంచి సక్సెస్ లతో దూసుకెళ్లింది.

కానీ ఆ తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకుల కంటికి కనిపించనేలేదు.

ఆనందం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న నటి రేఖ ఆ తర్వాత జానకి వెడ్స్ శ్రీరామ్, ఒకటో నెంబర్ కుర్రాడు వంటి పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈమెకు అప్పట్లోనే ఎంతో అభిమానం ఉండేది.

మంచి ఫామ్ లో ఉన్న సమయంలో సినీ ఇండస్ట్రీకి దూరం అయింది రేఖ.దీంతో గతంలో ఈమె సినీ ఇండస్ట్రీకి దూరం కావడానికి కొత్త హీరోయిన్ లు అని తెలిసింది.ఆ మధ్య ఇండస్ట్రీకి కొత్త కొత్త హీరోయిన్లు పరిచయం కావడంతో దర్శకనిర్మాతలు మొత్తం పాత హీరోయిన్ లకు హ్యాండ్ ఇచ్చారు.

ఇక రేఖ వేదవ్యాస్ లైఫ్ కూడా అలానే అయింది.

మళ్లీ ఇంతవరకు ఏ సినిమాలో కూడా నటించలేదు.ఇప్పటికీ ఈమె అభిమానులు ఈమె రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు.

ఈమె నటించిన సినిమాలను చూసి ఇటువంటి నటిని మిస్ అయ్యాము అంటూ బాగా బాధ పడుతుంటారు.

Telugu Actress, Actress Rekha Vedavyas, Hero Nagarjuna, Heroine, Movie, Okato Number Kurradu, Rekha Died Rumors, Rekha Vedavyas, Rekha Vedavyas Re Entry, Tollwyood, Tollywood, Tollywood Industry-Movie

గతంలో ఈమె బ్రతికుండగానే చనిపోయిందని పుకార్లు కూడా చేశారు.కాని తర్వాత మళ్ళీ తాను ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అందరికీ షాక్ ఇచ్చింది.

ఇదిలా ఉంటే గతంలో ఈమె ఓ రియాలిటీ షో ఇంటర్వ్యూలో పాల్గొన్నది.

అందులో తన వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంది.ఒకప్పుడు స్లిమ్ గా ఉండే రేఖ ఇప్పుడు కాస్త బొద్దుగా అయ్యింది.

ఇదంతా పక్కన పెడితే తాను కొన్ని విషయాలు పంచుకోగా.అందులో తను చనిపోయినట్లు వార్తలు వచ్చాయని.

బతికుండగానే శ్రద్ధాంజలి ఫోటో చూసుకునే ఛాన్స్ ఎవరికి వస్తుంది అంటూ నవ్వుతూ తెలిపింది.

ఇక ఈమె ఆ సమయంలో ఎవరింటికైనా వెళ్ళినప్పుడు తిరిగి తను ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ న్యూస్ పేపర్ టేబుల్ పై పెట్టి ఆ పేపర్ లో తన మరణ వార్త గురించి ఉంటే ఆ పేపర్ ను చూసి వాళ్లు షాక్ అవుతే భలే గమ్మత్తుగా ఉంటుంది అంటూ సరదాగా తెలిపింది.

Telugu Actress, Actress Rekha Vedavyas, Hero Nagarjuna, Heroine, Movie, Okato Number Kurradu, Rekha Died Rumors, Rekha Vedavyas, Rekha Vedavyas Re Entry, Tollwyood, Tollywood, Tollywood Industry-Movie

ఇక నాగార్జున నటించిన మన్మథుడు సినిమాలో ఓ గెస్ట్ పాత్రలో చేశానని తెలిపింది.ఆ పాత్ర కేవలం నాగార్జున కోసమే చేశానని తెలిపింది రేఖ.

ఆ తర్వాత నాగార్జున తనతో కలిసి మరో సినిమా చేద్దామని అన్నారట.కానీ ఇప్పటివరకు తనకు ఫోన్ చేయలేదని తెలిపింది రేఖ.ఇక ఆ షోలోనే నాగార్జున గారు మీ ఫోన్ కోసం వెయిటింగ్ ఇక్కడ.నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు అంటూ సరదాగా కామెంట్ చేయగా మంచి అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నాను అంటూ సరదాగా మాట్లాడింది.

ఈమె మళ్లీ త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కానీ అందులో ఎంత నిజముందో తెలియదు కానీ అభిమానులు మాత్రం ఈమె కోసం ఎదురు చూస్తున్నారనే చెప్పాలి.

#Tollwyood #ActressRekha #Rekha Rumors #Rekha Vedavyas #OkatoNumber

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు