ఆ నటి బంగ్లా కు పాకిన కరోనా,సీల్!  

Actress Rekha security guard tested corona positive, bungalow sealed, Actress Rekha,Mumbai, bollywood, Corona Cases - Telugu Actress Rekha, Actress Rekha Security Guard Tested Corona Positive, Bollywood, Bungalow Sealed, Corona Cases, Mumbai

బాలీవుడ్ లో వరుసగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.తాజాగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో పాటు అభిషేక్ బచ్చన్ కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.

 Actress Rekha Bungalow Sealed

అయితే ఇంకా ఆ విషయం గురించి చర్చ జరుగుతుండగానే ఒకప్పటి ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ రేఖా బంగ్లా కు కూడా ఈ కరోనా పాకినట్లు తెలుస్తుంది.దీనితో ఆమె బంగ్లా ను సీల్ చేసినట్లు తెలుస్తుంది.

మహారాష్ట్ర లోని ముంబై నగరంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసింది.ముంబై లోని బాంద్రా లో నివాసముంటున్న రేఖ బంగ్లా ను ముంబై అధికారులు సీల్ చేసినట్లు తెలుస్తుంది.

ఆ నటి బంగ్లా కు పాకిన కరోనా,సీల్-General-Telugu-Telugu Tollywood Photo Image

ఆమె బంగ్లా ముందు ఉండే ఇద్దరు సెక్యూరిటీ గార్డుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది.దీనితో ఆమె బంగ్లా ను సీల్ చేయడం తో పాటు కంటైన్మెంట్ జోన్ గా అధికారులు ప్రకటించినట్లు తెలుస్తుంది.

మరోపక్క బిగ్ బీ అమితాబ్(77) కు ఈ వయసులో కరోనా పాజిటివ్ రావడం ఆయన అభిమానుల్లో ఆందోళన కలిగిస్తుంది.ఇప్పటికే పలువురు ప్రముఖ బాలీవుడ్ నటుల మృతుల ఘటనలు చోటుచేసుకోవడం,ఇప్పుడు బిగ్ బీ కూడా కరోనా బారిన పడడం తో ఆందోళన చెందుతున్నారు.

దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటం తో కొన్ని రాష్ట్రాల మరోసారి కంప్లీట్ లాక్ డౌన్ అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి.అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా కరోనా కేసులు పెరిగిపోతుండటం తో జనాల్లో ఆందోళన మొదలవుతుంది.

ఈ క్రమంలోనే మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

#Corona Cases #Mumbai #Bungalow Sealed #Actress Rekha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actress Rekha Bungalow Sealed Related Telugu News,Photos/Pics,Images..