శీతాకాలంలో ఇలా స్నానం చెయ్యండంటున్న హాట్ హీరోయిన్!

ఇటీవల హీరోయిన్లు అందాల ఆరబోత చేసి అభిమానులను సొంతం చేసుకునేవారు అరుదు అయ్యారు.ఏ హీరోయిన్ ని టచ్ చేసిన సరే హెల్త్ అని, వ్యాయామం, ఫిట్నెస్ అని.

 Beauty Tips, Winter Season, Bathing Tips, Bollywood, Actress Raveena Tandon, Ski-TeluguStop.com

డ్రీసింగ్ సెన్స్ అంటూ అందరూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ వస్తున్నారు.అలానే ఇప్పుడు మరో హాట్ హీరోయిన్ కూడా చలికాలంలో ఎలా స్నానం చేస్తే ఆరోగ్యంగా, అందంగా ఉంటాం అనేది చెప్తుంది.

ఆ నటి ఎవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ రవీనా టాండన్‌ .

చలికాలంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే శరీరం దృడంగా ఉండదు అని.పొడిబారిపోయి నిర్జీవంగా తయారవుతుందని చెప్తుంది ఈ బ్యూటీ.ఈ చలికాలంలో చర్మవ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంటుందని.

వాతావరణ పరిస్థుతుల బట్టి శరీరాన్ని కాపాడుకోవాలని కొన్ని బ్యూటీ టిప్స్ చెప్పింది ఈ హాట్ బ్యూటీ. ”బ్యూటీ టాకీస్‌ విత్‌ రావ్జ్‌”అనే సిరీస్ లో ఆమె ఈ విషయాలను చెప్పుకొచ్చారు.

స్నానానికి ఉపయోగించే సబ్బు ఆర్గానిక్ అయి ఉండాలని అప్పుడే చర్మానికి హాని కలగదని చెప్పుకొచ్చింది ఈ భామ.ఇక స్నానం పూర్తయిన తర్వాత వస్త్రంతో చర్మాన్ని ఎంతో మృదువుగా తుడవాలని లేదంటే పాడైపోతుందంటూ చెప్పుకొచ్చింది.అంతే కాదు శరీరం మాయిశ్చరైజ్ చెయ్యాలని స్వచ్ఛమైన పాలు ఉపయోగిస్తే ఏంతో మంచి ఫలితం ఉంటుందని కూడా చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

ఇంకా జుట్టు రాలకుండా జుట్టు ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే చలికాలంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని.

ఈ చలికాలంలో షాంపూలు, కండిషనర్లు వాడటం కంటే కూడా పురాతన కాలంలో ఉపయోగించే ఆరు ఉసిరి కాయలు, కప్పు పాలు తీసుకుని బాగా మరిగించి పేస్ట్ లా చేసి పట్టించుకోవాలని అప్పుడే జుట్టు అందంగా మారుతుందని చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఈమె చెప్పిన బ్యూటీ టిప్స్ నెట్టింట వైరల్ గా మారాయ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube