నన్ను ఎవరు గుర్తుపట్టడం లేదు.. నటి రవళి కామెంట్స్ వైరల్?

నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్, కన్నడ బ్యూటీ శ్రీలీలా జంటగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోనంకి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పెళ్లి సందD.ఈ సినిమా ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిన్న హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు.

 Actress Ravali Interesting Comments In Pelli Sandad Movie Pre Release, Pelli San-TeluguStop.com

ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథులుగా పెళ్లిసందడి సినిమాలో నటించిన హీరో శ్రీకాంత్, హీరోయిన్స్ రవళి, దీప్తి భట్నాగర్‌ పాల్గొన్నారు. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వచ్చిన పెళ్లి సందడి సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే.ఇక ఈ సినిమాలో నటించిన రవళి వెళ్లి ఎంతో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ క్రమంలోనే ఈ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన రవళి షాకింగ్ కామెంట్ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నా పేరు రవళి అంటూ ఆమెను ఆమె పరిచయం చేసుకున్నారు.

ఒకప్పుడు ఎంతో ముద్దుగా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి అందరినీ ఆకట్టుకున్న రవళి ప్రస్తుతం అధిక శరీర బరువు పెరగడంతో తనని గుర్తుపట్టలేరేమోనని తనను తాను పరిచయం చేసుకుంటున్నట్లు తెలిసింది.

Telugu Actress, Actress Ravali, Chiranjeeevi, Raghavendra Rao, Pelli Sandadi, Pr

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో బయటకు ఎక్కడ రావడం లేదు.ఒకవేళ వచ్చిన అధిక శరీర బరువు పెరగటం వల్ల ఎవరూ తనని గుర్తు పట్టలేక పోతున్నారని ఈ సందర్భంగా ఆమె తెలియజేసింది.ఇక ఈ కార్యక్రమానికి రాఘవేంద్రరావు గారు పిలవడంతో కాదనలేకపోయాను ఆయన పిలిస్తే ఎలాంటి స్థితిలో ఉన్న హాజరవుతానని రాఘవేంద్రరావు పై ఉన్న గౌరవాన్ని తెలియజేశారు.

ఈ క్రమంలోనే 25 సంవత్సరాల తర్వాత శ్రీకాంత్ తనయుడుతో తెరకెక్కిన పెళ్లి సందD అద్భుతమైన విజయాన్ని అందుకుంటుందని ఈమె చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube