ఎక్కడికెళ్లినా అది నాతోనే ఉంటుంది.. రష్మిక కామెంట్స్ వైరల్!

ఛలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు.బాలీవుడ్ లో ఇప్పటికే మిషన్ మజ్ను షూటింగ్ ను పూర్తి చేసిన రష్మిక ప్రస్తుతం గుడ్ బై సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.

 Actress Rashmika Interesting Comments About Her Dog  Aura , Her Dog Aura , Inter-TeluguStop.com

తెలుగులో రష్మిక నటించిన పుష్ప సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుండగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.తాజాగా రష్మిక తన కుక్క గురించి చెబుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ మధ్య ఎక్కువగా కుక్క పిల్లతో కనిపిస్తున్న రష్మిక తన కుక్క పిల్లకు ఆరా అనే పేరును పెట్టుకున్నారు.ఆరా తన దగ్గరకు ఏ విధంగా వచ్చిందో రష్మిక చెబుతూ లాక్ డౌన్ గురించి ప్రకటన చేయగానే ఎక్కువ రోజులు లాక్ డౌన్ ఉండదని భావించానని ఆమె అన్నారు.

తన తల్లిదండ్రులు కూర్గ్ లో ఉంటారని లాక్ డౌన్ తక్కువ రోజులే ఉంటుందని అనుకోవడం వల్ల కూర్గ్ కు వెళ్లలేకెపోయానని ఆమె చెప్పుకొచ్చారు.

తాను లాక్ డౌన్ సమయంలో హైదరాబాద్ లో ఉండగా లాక్ డౌన్ ను పొడిగించడంతో ఒంటరితనాన్ని పోగొట్టుకోవాలని భావించి ఆరాను తెచ్చుకున్నానని రష్మిక పేర్కొన్నారు.

లాక్ డౌన్ నుంచి తన లోకం ఆరా అయిందని తాను ఎక్కడికి వెళ్లినా ఆరా తన వెంట ఉండాల్సిందే అని రష్మిక కామెంట్లు చేశారు.ప్రస్తుతం రష్మిక కుక్క పిల్లతో ఎంజాయ్ చేయడంతో పాటు ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.

Telugu Dog Aura, Netizens, Rashmika-Movie

రష్మిక కుక్క ఆరా గురించి నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.రష్మిక పుష్ప పార్ట్ 1తో పాటు పార్ట్ 2లో కనిపిస్తారని తెలుస్తోంది.పుష్పరాజ్ భార్య పాత్రలో రష్మిక నటిస్తుండగా ఈ సినిమా రష్మిక ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరుతుందని రష్మిక ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube