నటి రమ్యకృష్ణ ఒక్కరోజు సంపాదన ఎంతంటే?

రమ్యకృష్ణ పాత తరం యువతకు ఓ స్వప్న సుందరి అని నిరభ్యంతరంగా చెప్పవచ్చు.అప్పుడు ఉన్న ప్రతి ఒక్క టాప్ హీరోతో ఆడిపాడిన రమ్యకృష్ణ అప్పట్లో ఓ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిందని చెప్పవచ్చు.

 Heroine Ramya Krishnan Remuneration Per Day, Ramya Krishna Remuneration, Ramya K-TeluguStop.com

తరువాత రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నటించిన సినిమాలతో గ్లామరస్ హీరోయిన్ గా గ్లామర్ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది.అయితే నీలంబరి పాత్ర ఎంతగా రమ్యకృష్ణకు మంచి పేరు తీసుకొచ్చిందో, అలాగే బాహుబలి సిమిమాలో అద్భుత నటనతో శివగామి పాత్రలో లీనమై చేసిన నటనకు రమ్యకృష్ణ ఖ్యాతి ఖండాం తరాలు పాకింది.

ఇక బాహుబలి సినిమా హిట్ తో అందులో నటించిన ప్రముఖ నటుల ఖ్యాతి దశదిశలా వ్యాపించింది.

అయితే నటుల పేరు ప్రఖ్యాతలు ఎలాగైతే గొప్పగా మారాయో, అలాగే రెమ్యునరేషన్ లు కూడా భారీగా పెంచేశారు.

అయితే శివగామి రమ్యకృష్ణ గురించి సినీ వర్గాల్లో ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది.రమ్యకృష్ణ రెమ్యునరేషన్ కు సంబంధించి రకరకాలుగా చర్చించుకుంటున్నారు.అయితే ప్రస్తుతం రమ్యకృష్ణ రోజుకు 10 లక్షల రూపాయల వరకు తీసుకుంటుందట.సినిమా కాల్షీట్స్ ను బట్టి ఉదాహరణకు 10 రోజులంటే కోటి రూపాయల దాకా పారితోషికం తీసుకుంటుంది.

కుర్ర హీరోయిన్స్ ను మించి ఇంత పారితోషికం తీసుకుంటున్నదంటే రమ్యకృష్ణ క్రేజ్ ఎంతుందో మనం అర్ధం చేసుకోవచ్చు.ఏది ఏమైనా ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube