ఈ హీరోయిన్ భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత ఏం చేస్తోందంటే…?  

Rambha, telugu actress, veteran heroine, Real life news, Tollywood - Telugu Rambha, Real Life News, Telugu Actress, Tollywood, Veteran Heroine

తెలుగులో ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన “ఆ ఒక్కటి అడక్కు” చిత్రంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ సరసన నటించి హీరోయిన్ గా పరిచయమై తెలుగు ప్రేక్షకులను బాగానే  మెప్పించిన ముద్దుగుమ్మ రంభ గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే ఈమె అసలు పేరు విజయలక్ష్మి ఈడీ కానీ సినిమా పరిశ్రమలో అప్పటికే ఆ పేరుతో చాలా మంది ఉండడంతో రంభ అని పేరు మార్చుకుంది.

 Actress Rambha Real Life News

కాగా నటి రంభ తెలుగు, తమిళం, హిందీ, భోజపురి,బెంగాలీ, తదితర భాషలలో నటించింది.అయితే సినిమా అవకాశాలతో బిజీ బిజీగా గడుపుతున్న సమయంలో కెనడా దేశానికి చెందినటువంటి ఓ ప్రముఖ వ్యాపార వేత్తని పెళ్లి చేసుకొని కొంతకాలం సినిమాకి బ్రేక్ ఇచ్చింది.

అయితే ప్రస్తుతం నటి రంభ కు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఉన్నాడు.ప్రస్తుతం నటి రంభ తన కుటుంబ బాధ్యతలు చక్కబెడుతూ కర్ణాటకలో ఉన్నటువంటి తన సొంత నివాసంలో పిల్లలతో కలిసి ఉంటున్నట్లు సమాచారం.

ఈ హీరోయిన్ భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత ఏం చేస్తోందంటే…-Latest News-Telugu Tollywood Photo Image

కాగా ఇటీవలే నటి రంభ కు మరియు ఆమె భర్త కు మనస్పర్ధలు, విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నట్లు  దాంతో ఆమె భర్త రంభ కుటుంబ పోషణ నిమిత్తమై  నెలనెలా  కొంత డబ్బు పంపిస్తున్నట్లు పలు వార్తలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ విషయం ఇలా ఉండగా నటి రంభ చివరగా ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన  “యమదొంగ” అనే చిత్రంలో “నాచోరే నాచోరే”.

అనే పాటకి నృత్యం చేసింది.ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు సినిమాల్లో నటించలేదు.

అయితే పలు రకాల వ్యాపార ప్రకటనల్లో మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తోంది.అలాగే ఇటీవలే రంభ నటన పరంగా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం.

#Veteran Heroine #Rambha #Real Life News

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actress Rambha Real Life News Related Telugu News,Photos/Pics,Images..