బ్రహ్మోత్సవంలో కూడా ఆమె?

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు.‘శ్రీమంతుడు’ అనే టైటిల్‌ను ఈ సినిమాకు పరిశీలిస్తున్నట్లుగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

 Rakul Preet’s Romance With Mahesh!-TeluguStop.com

శృతిహాసన్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.మే 1న ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సినిమా తర్వాత మహేష్‌బాబు తన తర్వాత సినిమాను శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం’ సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.ప్రస్తుతం ఆ సినిమా కోసం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

పీవీపీ బ్యానర్‌లో ఆ సినిమా తెరకెక్కబోతుంది.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా తర్వాత శ్రీకాంత్‌ అడ్డాల మరియు మహేష్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న ‘బ్రహ్మోత్సవం’లో హీరోయిన్‌గా తాజాగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల ఆమెతో చర్చలు జరిపాడనే టాక్‌ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.ఇప్పటికే ఈమె ‘కిక్‌`2’ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది.

తాజాగా ఎన్టీఆర్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంతో పాటు, చరణ్‌, శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో కూడా హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది.ఈ అమ్మడు ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోంది.

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ సినిమాతో క్రేజ్‌ను దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.భవిష్యత్తులో ఈమె స్టార్‌ హీరోయిన్‌ అవ్వడం ఖాయం అని సినీ వర్గాల వారు విశ్లేషిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube