వయస్సు పెరిగినా తీరు మారలేదు.. సుమపై ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్?

యాంకర్ సుమ వయస్సు పెరుగుతున్నా యాంకరింగ్ తో అవకాశాలు అందిపుచ్చుకుంటున్న సంగతి తెలిసిందే.దాదాపు అన్ని ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో సుమ యాంకర్ గా చేస్తున్న షోలు టెలీకాస్ట్ కానుండగా ఆ షోలు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి.

 Actress Rajyalaxmi Shocking Comments About Anchor Suma-TeluguStop.com

ఈటీవీలో ప్రసారమయ్యే క్యాష్ షోకు సుమ యాంకర్ గా చేస్తుండగా బాబు మోహన్, రాజ్యలక్ష్మి, గౌతమ్ రాజు, శివపార్వతి గెస్టులుగా హాజరయ్యరు.

బాబు మోహన్ సుమతో నేను బ్యాగులు తీసుకొనిరావడం మరిచిపోయానని చెప్పగా సుమ మీరు గెలుస్తానని ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారని అర్థమవుతోందని సుమ చెబుతారు.

 Actress Rajyalaxmi Shocking Comments About Anchor Suma-వయస్సు పెరిగినా తీరు మారలేదు.. సుమపై ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వెంటనే బాబు మోహన్ మీరు గెలవనిస్తారా అంటూ సుమ గురించి షాకింగ్ కామెంట్లు చేశారు.ఆ తర్వాత రాజ్యలక్ష్మి ఎంట్రీ ఇవ్వగా ఈరోజు మీరు నాకు కాంపీటీషన్ గా రెడీ అయ్యారని సుమ రాజ్యలక్ష్మితో చెబుతారు.

సుమ అలా అనగానే రాజ్యలక్ష్మి స్పందిస్తూ సుమను చూస్తే తనకు చాలా అసూయగా ఉందని రాజ్యలక్ష్మి చెబుతారు.

మేము ఎప్పుడో మా చిన్నప్పుడు లంగావోణీలు వేశామని సుమ మాత్రం ఇప్పటికీ లంగావోణీలు వేస్తున్నారని రాజ్యలక్ష్మి అన్నారు.వయస్సు పెరిగినా సుమ డ్రెస్సింగ్ విషయంలో మాత్రం మారలేదని రాజ్యలక్ష్మి చెప్పడం గమనార్హం.ఆ తర్వాత గౌతమ్ రాజు ఏజ్ పదేళ్లు తగ్గిందని సీక్రెట్ ఏంటని అడగగా గౌతమ్ రాజు సుమ సీక్రెట్ ఏంటో చెప్పాలని అడుగుతాడు.

అందుకు బదులుగా మీ సీక్రెట్ ఏంటని సుమను గౌతమ్ రాజు అడగగా ఎప్పుడూ ఇలా వాగుతూ ఉండటమేనని సుమ చెబుతారు.

ఆ తరువాత శివపార్వతి ఎంట్రీ ఇచ్చి సుమ అంటే చాలా ఇష్టమని చెప్పగా బాబు మోహన్ కు రెండు బ్యాగులు ఇచ్చానని మీకు మాత్రం మూడు బ్యాగులు ఇస్తానని సుమ చెబుతారు.క్యాష్ షోలో సుమ తన పంచ్ లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.

#Babu Mohan #Punches #Cash #Rajyalaxmi #Actress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు