ఈ వయస్సులో ఇదేం బుద్ధి.. నటిపై నెటిజన్ల ట్రోలింగ్..!  

actress rajini chandy trolled photo shoot age 69, age 69 , negative comments, rajini chandi, trolled photoshoot - Telugu Age69, Negative Comments, Rajini Chandi, Trolled Photoshoot

ఆ నటి వయస్సు 69 సంవత్సరాలు. ఐదేళ్ల క్రితం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆ నటికి మొదట్లో బాగానే ఆఫర్లు వచ్చాయి.

TeluguStop.com - Actress Rajini Chandy Trolled Photo Shoot Age 69

ఇప్పటికే అనేక భాషల్లో హిట్టైన బిగ్ బాస్ షో మలయాళం సీజన్ 2 లో కూడా కూడా ఆమె పాల్గొన్నారు.అయితే గతేడాది లాక్ డౌన్ అమలైన తరువాత క్రమంగా అవకాశాలు తగ్గడంతో పాశ్చాత్య వస్త్రధారణలో ఫోటోలు దిగి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఆ నటి పేరు రజినీ చాందీ కాగా నటిని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

TeluguStop.com - ఈ వయస్సులో ఇదేం బుద్ధి.. నటిపై నెటిజన్ల ట్రోలింగ్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

సాధారణంగా యంగ్ హీరోయిన్లు అవకాశాల కోసం ఫోటో షూట్ లలో పాల్గొని గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తుంటారు.

కానీ ఏడు పదుల వయస్సులో రజినీ చాందీ చేయించుకున్న ఫోటో షూట్ వల్ల ఆమె నెటిజన్ల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంది.సాధారణంగా రజినీ చాందీ ఎక్కువగా చీరల్లో కనిపిస్తూ ఉంటారు.

అయితే కారణమేంటో తెలీదు కానీ ఫ్లోరల్‌ మాక్సీ, డెనిమ్ లు ధరించి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Telugu Age69, Negative Comments, Rajini Chandi, Trolled Photoshoot-Movie

ఆ ఫోటోలను చూసిన నెటిజన్లలో కొందరు ఈ వయస్సులో ఇదేం బుద్ధి.? అని కామెంట్లు చేస్తుంటే మరి కొందరు మాత్రం మీరు ఇంకా చనిపోలేదా.? అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.ఒరు ముతస్సి గాథ అనే సినిమాలో బామ్మ పాత్ర ద్వారా రజినీ ప్రేక్షకులకు పరిచయమయ్యారు.అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం ఆమెను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో సానుకూలంగా స్పందిస్తున్నారు.

అయితే ట్రోలింగ్ పై కూడా స్పందించి రజినీ చాందీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

త్వరలో తనకు 70 సంవత్సరాలు నిండుతాయని.

ముసలావిడ అందంగా కనిపిస్తే కొందరు అసూయ పడుతున్నారని పేర్కొన్నారు.ఇలాంటి వ్యాపకాలు స్పూర్తిగా నిలుస్తాయని.

తనకు నచ్చిన పనిని తాను చేస్తున్నానని రజినీ చాందీ చెప్పుకొచ్చారు.రజినీ చాందీ వివరణ ఇచ్చినా ఆమెపై ట్రోలింగ్ ఆగకపోవడం గమనార్హం.

#Rajini Chandi #Age69

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు