కొలంబో ఉగ్రదాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న సీనియర్ హీరోయిన్  

Actress Radhika Sharath Kumar Escape From Terror Attack In Sri Lanka -

శ్రీలంక రాజధాని కొలంబో లో ఈ రోజు ఈస్టర్ పర్వదినం సందర్భంగా క్రైస్తవులు అందరూ ప్రార్ధనలో మునిగిపోయి ఉన్న సమయంలో ఊహించని విధంగా ఉగ్రవాదులు వరుస పేలుళ్ళతో అల్లకల్లోలం సృష్టించారు.మొత్తం 8 చోట్ల వరుసగా జరిగిన ఈ బాంబు దాడులలో ప్రజలకి తేరుకునే అవకాశం కూడా లేకుండా పోయింది.

Actress Radhika Sharath Kumar Escape From Terror Attack In Sri Lanka

ఇక ఈ మారణహోమంలో ఇప్పటి వరకు 400 మృతి చెందగా వందల సంఖ్యలో క్షతగాత్రులు అయినట్లు తెలుస్తుంది.ఈ ఉగ్రదాడిని ప్రపంచ దేశాలన్నీ ఇప్పటికే ఖండించాయి.

అలాగే శ్రీలంకని ఆదుకోవడానికి ముందుకొస్తున్నాయి.

అయితే ఈ ఉగ్రదాడికి పాల్పడింది ఎవరనే విషయం ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.

ఇదిలా ఉంటే ఈ ఉగ్ర దాడి నుంచి సినియర్ నటి రాధిక తృటిలో తప్పించుకున్నారు.బాంబు పేలుడు జరిగిన సిన్నామన్ గ్రాండ్ హోటల్ లోనే ఆమె కూడా బస చేశారు.

ఆయితే బ్లాస్ట్ కు కొద్ది నిమిషాల ముందు రాధిక హోటల్ ఖాళీ చేసి వెళ్లిపోయారు.కొద్ది క్షణాల వ్యవధితో ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగారు.హెటల్ నుంచి బయటికి వెళ్లాక పేలుళ్ల గురించి తెలుసుకున్న రాధిక బ్లాస్టింగ్ తనకు షాకింగ్గా ఉందని ట్వీట్ చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actress Radhika Sharath Kumar Escape From Terror Attack In Sri Lanka- Related....