ఈ ఫోటోలో ఉన్న ప్రముఖ నటిని గుర్తు పట్టారా?  

actress radhika sarath kumar rare photo goes viral in social media, actress radhika sarath kumar,social media, viral photos, radhika childhood photos, social media - Telugu Actress Radhika Sarath Kumar, Actress Radhika Sarath Kumar Rare Photo Goes Viral In Social Media, Heroine Radhika, Mr Radha, Radhika Childhood Photos, Radhika Sarath Kumar, Radhika Viral Photo, Social Media, Viral Photos

ఇప్పటితరం యువతకు రాధిక అంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ 1980, 90 దశకాలలో రాధిక స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు.తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో వరుస అవకాశాలతో స్టార్ స్టేటస్ అందుకున్నారు.

TeluguStop.com - Actress Radhika Sarathkumar Photo Goes Viral In Social Media

స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు సంపాదించుకుని తన నటనతో ప్రత్యేకతను చాటుకున్నారు.సినిమాల్లోనే కాదు టీవీ సీరియళ్లతో కూడా రాధిక టీవీ రంగంపై తనదైన ముద్ర వేశారు.
1982లో న్యాయం కావాలి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రాధికకు తొలి సినిమాతోనే ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చింది.చిరంజీవికి జోడీగా రాధిక ఎక్కువ సినిమాల్లో నటించారు.

హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తరువాత రాధిక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు పరిమితమయ్యారు.రాధిక తెలుగులో చివరగా 2017లో విడుదలైన రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ తల్లి పాత్రలో నటించి మెప్పించారు.

TeluguStop.com - ఈ ఫోటోలో ఉన్న ప్రముఖ నటిని గుర్తు పట్టారా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

రాధిక తెలుగులో పలు టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరించారు.
నటి రాధిక తండ్రి ఎమ్ రాధ వర్ధంతి సందర్భంగా సోషల్ మీడియాలో ఒక పిక్ ను షేర్ చేయగా ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తండ్రితో ఉన్న ఫోటోను షేర్ చేసిన రాధిక తండ్రి గొప్పతనాన్ని, తండ్రితో ఉన్న అనుబంధాన్ని వెల్లడించారు.ఈ ఫోటోలో రాధిక తండ్రి పౌరాణిక పాత్రలో కనిపిస్తుండగా చిన్నప్పుడు రాధిక ఏ విధంగా ఉండేదో ఈ ఫోటో ద్వారా మనకు తెలుస్తోంది.

చేసే పనిలో తన తండ్రి ఎప్పుడూ ప్రతిబింబిస్తూ ఉంటారని.తండ్రి తన మనస్సులో ఎప్పుడూ నిలిచిపోయి ఉంటారని రాధిక ట్వీట్ లో పేర్కొన్నారు.

రాధిక తండ్రి ఎం ఆర్ రాధ నటుడిగా ప్రత్యేకతను చాటుకోవడంతో పాటు రాజకీయ నాయకునిగా గుర్తింపు తెచ్చుకున్నారు.నెటిజన్లు రాధిక ట్వీట్ కు స్పందిస్తూ ఎం ఆర్ రాధ గొప్ప పాత్రలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారని.

వర్ధంతి సందర్భంగా రాధిక తండ్రిని గుర్తు చేసుకోవడం గొప్పగా ఫీలవుతున్నామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

#RadhikaSarath #Social Media #RadhikaViral #ActressRadhika #ActressRadhika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actress Radhika Sarathkumar Photo Goes Viral In Social Media Related Telugu News,Photos/Pics,Images..