నాగ శౌర్యకి తల్లిగా నటిస్తున్న సీనియర్ హీరోయిన్ రాధిక

యంగ్ హీరో నాగ శౌర్య ఈ మధ్య వరుస సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడమే కాకుండా ఒకదాని తర్వాత ఒకటిగా గ్యాప్ లేకుండా చేసుకుంటూ వెళ్తున్నాడు.ఇప్పటికే లక్ష్య, వరుడు కావలెను సినిమా షూటింగ్ లు పూర్తి చేసి రిలీజ్ కి రెడీ చేసేశాడు.

 Actress Radhika Play Mother Role For Naga Shourya, Tollywood, Srikrishna Satyabh-TeluguStop.com

ఈ రెండు సినిమాలు రెండు భిన్నమైన కథలతో తెరకెక్కినవే కావడం విశేషం.వరుడు కావలేను సినిమా రొమాంటిక్ లవ్ స్టొరీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కగా, లక్ష్య సినిమా స్పోర్ట్స్ నేపధ్యంలో తెరకెక్కింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నాగ శౌర్య ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.అలాగే హోం బ్యానర్ ఐరా ప్రొడక్షన్స్ లో వరుస సినిమాలు చేస్తూ ఇప్పుడు అనీష్ కృష్ణ దర్శకత్వంలో కొత్త సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళాడు.

అనీష్ కృష్ణ తాజాగా గాలి సంపత్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.

ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ ఉంది.

ఇదిలా ఉంటే రిలీజ్ హడావిడి అయిన తర్వాత నాగ శౌర్య కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాకి ఇప్పటికే శ్రీకృష్ణ-సత్యభామ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసేసినట్లు తెలుస్తుంది.

ఈ కథ కూడా రొమాంటిక్, ఫ్యామిలీ లవ్ స్టొరీగానే దర్శకుడు అనీష్ కృష్ణ ఆవిష్కరిస్తున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన ఒక ఫోటోని సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్ షేర్ చేస్తూ నాగ శౌర్య టాలెంట్ గురించి, డెడికేషన్ గురించి ప్రశంసలు కురిపించింది.

ఈ స్టిల్ లో ట్రెడిషనల్ లుక్ లో రాధిక శరత్ కుమార్, నాగ శౌర్య కనిపిస్తున్నారు.దీనిని బట్టి శ్రీకృష్ణ సత్యభామ సినిమాలో రాధికా శౌర్యకి తల్లిగా నటిస్తుందని క్లారిటీ వస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube