బోల్డ్ యాక్టర్ కు హాలీవుడ్ ఆఫర్,ఏకంగా జేమ్స్ బాండ్ చిత్రంలో  

Actress Radhika Aapte Got A Chance To Act With Hollywood James Bond-bollywood And Tollywood Heroin Radhika Apte,indian Heroins,radhika Aapte,wedding Guest

ఒకప్పుడు ఇండియన్ హీరోయిన్స్ అంటే కేవలం ఇండియా లో వరకు మాత్రమే పరిమితం అయ్యేవారు.కానీ టాలెంట్ ఉండి, బోల్డ్ గా నటించే హీరోయిన్స్ కు హాలీవుడ్ సినిమాల్లో కూడా అవకాశాలు ఇటీవల లభిస్తున్నాయి.

Actress Radhika Aapte Got A Chance To Act With Hollywood James Bond-bollywood And Tollywood Heroin Radhika Apte,indian Heroins,radhika Aapte,wedding Guest-Actress Radhika Aapte Got A Chance To Act With Hollywood James Bond-Bollywood And Tollywood Heroin Apte Indian Heroins Radhika Wedding Guest

గతకొన్నేళ్లు గా ఇండియన్ హీరోయిన్స్ హాలీవుడ్ సినిమాల్లో నటిస్తుండడం పరిపాటిగా మారింది.ఈ నేపథ్యంలోనే అప్పుడు ఐశ్వర్యా రాయ్,దీపికా పదుకొనే,ప్రియాంక చోప్రా ఇలా అందరూ కూడా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్లి నటించిన వారే.అయితే ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లో బోల్డ్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న రాధికా ఆప్టే కి హాలీవుడ్ ఆఫర్ వచ్చింది.

ఏకంగా జేమ్స్ బాండ్ బ్రాండ్ నుంచి రాబోతున్న చిత్రంలో ఈ ముద్దుగుమ్మ కు అవకాశం లభించినట్లు తెలుస్తుంది.తెలుగులో బాలయ్య సరసన లెజెండ్,లయన్ లాంటి సినిమాలు చేసిన రాధిక ధోని,రక్త చరిత్ర లాంటి వరుస సినిమాలు చేసినప్పటికీ ఆమెకు పెద్దగా ఇమేజ్ అనేది రాలేదు.

అయితే సినిమాల సంగతి పక్కన పెడితే ఎప్పటికప్పుడు ఏదో ఓ కొత్త సంచలనంతో ప్రేక్షకుల ముందుకొస్తుంది ఈ ముద్దు గుమ్మ.ఇండియన్ సినిమాల్లో నటిస్తున్నప్పటికీ మరోపక్క హాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటుంది.

ఈ క్రమంలోనే ఈ మధ్యే ది వెడ్డింగ్ గెస్ట్ సినిమాలో కూడా నటించిన రాధిక అందులో న్యూడ్ సీన్ కూడా చేసి తన బోల్డ్ యాక్టింగ్ ని మరోసారి చూపించింది.ఇప్పటికి రాధిక చేసిన సినిమాలు కొన్నే అయినప్పటికీ ఆమె పేరు మాత్రం ఇండస్ట్రీ మొత్తం మారుమ్రోగుతుంది.

ఆమె చేసిన అన్ని చిత్రాల్లో కూడా చాలా బోల్డ్ గా నటించి పెద్ద సంచలనం సృష్టించింది.ఇక ఇప్పడు ఈ భామకు వరుసగా హాలీవుడ్ నుంచి కూడా వరస ఆఫర్లు వస్తున్నాయి.

తాజాగా మరో రెండు సంచలన సినిమాల్లో నటించబోతున్నట్లు సమాచారం.