‘కళ్యాణ వైభోగమే’ రాశి రీ ఎంట్రీ  

Actress Raasi Re Entry With Kalyana Vaibhogame -

తన హాట్‌ అందాలతో నిన్నటి తరం కుర్రకారును మత్తెకించిన తెలుగు హీరోయిన్‌ రాశి గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది.పెళ్లి, సంసారం, పిల్లలు ఇలా ఇంత కాలంగా బిజీగా గడిపిన రాశి మళ్లీ తెలుగు పరిశ్రమలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా ఉంది.

ఇప్పటికే ఈమె ఒక హీరోయిన్‌గా ముఖ్య పాత్రలో నటిస్తూనే ఉంది.నందిని రెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా నటిస్తున్న ‘కళ్యాణ వైభోగమే’ సినిమాలో రాశి నటిస్తున్నట్లుగా తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.

Actress Raasi Re Entry With Kalyana Vaibhogame--Telugu Tollywood Photo Image

ఇటీవలే రాశి తన కూతురుతో కలిసి ఫొటో షూట్‌కు పోజులు ఇచ్చింది.దాంతో ఈమెకు అవకాశాలు తన్నుకు వస్తున్నాయి.

ఈమె ప్రస్తుతం నటిస్తున్న ‘కళ్యాణ వైభోగమే’ సినిమా విడుదల అయిన తర్వాత మరిన్ని ఆఫర్లు రావడం ఖాయం అంటున్నారు.ఇప్పటికే నిన్నటి తరం హీరోయిన్స్‌ నదియా, మీనా, మధుబాల వంటి వారు అమ్మగా, అక్కగా, అత్తగా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు.

మరి ఈ క్రమంలో రాశి కూడా రీ ఎంట్రీతో అదరగొడుతుందేమో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actress Raasi Re Entry With Kalyana Vaibhogame- Related....