మహేష్ బాబు అంటే ఇష్టమంటున్న రాశి ఖన్నా!  

రాశి ఖన్నా ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ఎన్నో చిత్రాలలో నటించి తన కంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

TeluguStop.com - Actress Raashi Khanna Birthday Special Celebrities Wishes

అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగసౌర్య సరసన ఊహలు గుసగుసలాడే చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైన రాశి ఖన్నా ప్రస్తుతం తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

తెలుగులో తను నటించిన మొదటి సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఎన్నో అవకాశాలను దక్కించుకుంది.

TeluguStop.com - మహేష్ బాబు అంటే ఇష్టమంటున్న రాశి ఖన్నా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

జోరు, విలన్, ప్రతి రోజు పండుగే, వెంకీ మామ వంటి చిత్రాలు విజయవంతం కావడంతో మరిన్ని అవకాశాలను దక్కించుకుంది.అయితే రాశి ఖన్నా ప్రస్తుతం తమిళ హీరో సూర్య తో త్వరలో హరి దర్శకత్వంలో అరువా చిత్రంలో నటించడానికి ఒప్పుకొన్నారు.

అంతేకాకుండా జీవ హీరోగా పీఏ విజయ్ దర్శకత్వంలో మరో సినిమాను చేయడానికి రాశి ఖన్నా సంతకం చేశారు.కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించనున్న తుగ్లక్ చిత్రంలో నటించే అవకాశాన్నిరాశి ఖన్నా దక్కించుకున్నారు.

సాధారణంగా ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కూడా వారికి ఇండస్ట్రీలో ఇష్టమైన సెలబ్రిటీస్ ఉంటారని మనకు తెలుసు.ఈ నేపథ్యంలోనే రాశి కన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు బాలీవుడ్ లో షారుక్ ఖాన్, ప్రియాంక చోప్రా తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే తనకు ఇష్టమని రాశి ఖన్నా తెలిపారు.

రాశి కన్నా ఈరోజు (నవంబర్ 30) తన పుట్టిన రోజు సందర్భంగా పలువురు అభిమానులు, సెలబ్రిటీస్ ఈమెకు పెద్దఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి రాశి ఖన్నా కి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు.

#RaashiKhanna #HeroineRaashi #FavouriteStar #RaashiKhanna #MaheshBabu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు