రాహుల్ కి నాకంటే నా చెల్లెలే ఎక్కువ ఇష్టం అంటున్న పున్ను... 

తెలుగులో బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ గెలవడంతో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.అంతేగాక ఇప్పటికే పలు రకాల షోలు నిర్వహిస్తూ సార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్సులు దక్కించుకున్నాడు.

 Actress Punarnavi Bhupalam Do Sensational Comments Rahul Sipligunj-TeluguStop.com

అయితే  బిగ్ బాస్ సీజన్ 3 షో జరుగుతున్న సమయంలో రాహుల్ సిప్లిగంజ్ తన తోటి కంటెస్టెంట్ అయిన హీరోయిన్ పునర్నవి భూపాలంతో ప్రేమాయణం జరుపుతున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.అయితే పునర్ణవి మాత్రం తమ మధ్య అలాంటిదేమీ లేదని మేము మంచి స్నేహితులని ఆ వార్తలను కొట్టి పారేసింది.

అయితే తాజాగా పునర్నవి భూపాలం నటించినటువంటి చిత్రం   “చిన్న విరామం తర్వాత”.ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా పునర్ణవి భూపాలం ఓ ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఇందులో భాగంగా పునర్నవి నటించినటువంటి చిన్న విరామం తర్వాత అనే చిత్రాన్ని రాహుల్ సిప్లిగంజ్ చూసి ఈ చిత్రంలో తన చెల్లెలి పాత్ర పోషించినటువంటి ఓ యువతి బాగా నచ్చిందని అన్నాడట.అయితే ఆ పాత్రలో నటించిన టువంటి నటి ఎవరో తెలియాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే అంటూ చెప్పుకొచ్చింది పునర్నవి భూపాలం.

Telugu Tollywood-Movie

అయితే ప్రస్తుతం రాహుల్ సిప్లిగంజ్ రజినీకాంత్ నడుస్తున్న టువంటి ఓ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నాడు.మొదటి రెండు సీజన్లలో విజేతలు అయినటువంటి శివబాలాజీ మరియు కౌశల్ కి బిగ్ బాస్ లో నటించిన తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు కానీ రాహుల్ సిప్లిగంజ్ మాత్రం బిగ్ బాస్ షో విన్నర్ ఐన తరువాత మాత్రం ఓవర్ నైట్ స్టార్ అయిపోయి మంచి అవకాశాలను దక్కించుకుంటున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube