బాలీవుడ్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ప్రియాంక చోప్రా, ఆ తర్వాత హాలీవుడ్ కి మకాం మార్చేసి అక్కడ కూడా తన సత్తాను నిరూపించుకుంది.
బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.ఇక 2019లో ప్రియాంక తన ఆత్మకథ అయిన అన్ ఫినిషెడ్ : ఏ మెమోరీ అనే పుస్తకం రాసి విడుదల చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ పుస్తకం రాస్తున్నట్లు 2018లో ప్రియాంక చోప్రా ప్రకటించింది.ఆ తరువాత ఆ 2019లో ఆ బుక్ ని పబ్లిష్ చేసింది.
ఇక ఆ పుస్తకం రాసే సమయంలో తన మదిలో మెదిలిన కొన్ని ఆలోచనల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రా.ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.
ఈ బుక్ రాస్తున్న సమయంలో ఎంతో భయంగా అనిపించింది.అంతే కాకుండా ఈ పుస్తకాన్ని రాయలేనని ఎన్నోసార్లు అనుకున్నాను.
కానీ నేను ఇంటర్వ్యూలలో చెప్పని విషయాలను కూడా ఆ పుస్తకంలో చెప్పాలి అని నిర్ణయించుకున్నాను అని ఆమె తెలిపింది.ఇంతవరకు నేను ఎక్కడ ప్రస్తావించని, ఎవరికీ తెలియని కొన్ని కొత్త కొత్త విషయాలను ఈ పుస్తకం ద్వారా తెలియజేయాలి అనుకున్నాను,కానీ ఆ సమయంలో వచ్చే కొన్ని ఆలోచనలు ఎంతో భయాన్ని కలిగించేవి అని ఆమె చెప్పుకొచ్చింది.

అదే విధంగా ఈ బుక్ రాస్తున్న సమయంలో ఈ పుస్తకం చదివిన వారందరికీ, నా భయాలు, బలహీనతలు, ఫెయిల్యూర్స్ అన్ని తెలిసి పోతాయని భయపడ్డాను.అలాగే అవి నాకు ఏవైనా సమస్యలు తెచ్చే అవకాశం ఉందా అని ఆలోచించాను అని ఆమె తెలిపింది.అలా అలోచించడానికి కారణం కూడా లేకపోలేదు.ఎందుకంటే ఒక మహిళగా మీ అందరికీ బలాలు మాత్రమే తెలుపుతారు.కానీ ప్రశాంతంగా బతకడానికి కొన్నింటిని దాయాల్సి వస్తుంది.కానీ ఒక నటిగా, ఒక పబ్లిక్ ఫిగర్ గా ఇలా చేయడం అంత సులువైన విషయం కాదు అని ఆమె తెలిపింది.
ప్రియాంక తన బుక్ ని పబ్లిష్ చేసిన కొన్ని రోజులకే న్యూయార్క్ టైమ్స్ లోనే బెస్ట్ సెల్లర్ గా నిలిచిన విషయం తెలిసిందే.