ఒక్క కన్ను గీటుతో కుర్రకారు హృదయాలు కొల్లగొట్టిన మలయాళీ భామ ప్రియా ప్రకాష్ వారియర్. అప్పట్లో ఆమె కన్ను కొట్టే వీడియో చాలా వైరల్ అయ్యింది.
దాంతో ఒక్క సారిగా ప్రియా సెన్సషనల్ అయిపోయింది.ఆ తర్వాత వెంటనే టాలీవుడ్, బాలీవుడ్ లోనూ అవకాశాలు అందుకున్నటు ప్రియా.
తెలుగులో చెక్ సినిమాలో నితిన్ సరసన నటించిన ప్రియా ప్రకాష్, ఆ తర్వాత యువ నటుడు తేజతో ఇష్క్ సినిమాలో నటించి మంచి మార్కులు సంపాదించుకున్నారు.
ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ కన్నుగీటు బొమ్మ తన టాటూ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు చెప్పారు ఈ మలయాళీ కుట్టి.
తనకు టాటూలంటే చాల ఇష్టమని, ముఖ్యంగా తన మీద ఉన్న కార్పెడియం టాటూ చాల ప్రత్యేకం అని అన్నారు ప్రియా.కార్పెడియం అంటే ప్రస్తుతాన్ని సంపూర్తిగా అనుభవించు అని అర్థమట.
ఇదే కాకుండా తన మణికట్టు మీద, చేతి వేలి పైన కూడా టాటూలు వేయించుకుని సందడి చేస్తోంది ఈ భామ.
ఇక తన కుటుంబ విషయానికొస్తే… ప్రియాకి ఒక తమ్ముడు.అమ్మ గృహిణి, నాన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి .వాళ్ళ అమ్మా నాన్న కోసమే డిగ్రీ పూర్తి చేసిందట.తనకి చిన్నప్పటి నుంచి నటి కావాలనేదే కల కనేదట.

ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయి.కాబట్టి ప్రస్తుతం ఉన్నత చదువులు చదివే ప్రసక్తే లేదంటోంది ఈ ముద్దుగుమ్మ.సాధ్యమైతే కొన్ని రోజుల తర్వాత తన చదువు గురించి ఆలోచిస్తానని ఆమె చెప్పారు.
ఇప్పటి వరకు ప్రియా తల్లిదండ్రులు తన సినిమాని థియేటర్ లో చూడలేదట.తమ్ముడి చదువు కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అవకాశం ఉంటేనే నా సినిమాలు చూస్తారు అంటున్నారు ప్రియా ప్రకాష్ వారియర్.

చెక్ సినిమాలో నితిన్ తో తన అనుభవాల గురించి చెబుతూ.తనకు నాకూ కాంబినేషన్ సీన్లు చాల తక్కువుండటం, ఆలాగే తనకది తొలి సినిమా కావడంతో చాలా జాలీ జాలీగా ఉండేదని ఆమె చెప్పారు.నితిన్ మాత్రం పాత్ర కోసం చాలా డెడికేటెడ్ గా ఉండేవారని ప్రియా పేర్కొన్నారు.