షర్మిల పార్టీలోకి మరో నటి...ఆ నటి ఎవరంటే?

తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం రసవత్తరంగా మారుతున్న పరిస్థితులలో షర్మిల పార్టీ రాకతో మరింత రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే.ఇప్పుడిప్పుడే నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న బీజేపీకి షర్మిల ఎంట్రీ పెద్ద దెబ్బ అనే చెప్పవచ్చు.

 Actress Priya Meets Sharmila Party Telangana-TeluguStop.com

అయితే ప్రస్తుతం షర్మిల పార్టీ ఎంట్రీకి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.మిగతా పార్టీలలో ఉన్న అసంతృప్తులు ఇప్పుడు షర్మిల పార్టీ వైపు చూస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

అన్ని రాజకీయ పార్టీలలో పార్టీ ప్రారంభించడానికి ముందు చేరే వారిలో ముందుండే వారిలో రాజకీయ నాయకులే ఉంటారు.కాని షర్మిల పార్టీ విషయానికొస్తే సీన్ రివర్స్ గా ఉంది.

 Actress Priya Meets Sharmila Party Telangana-షర్మిల పార్టీలోకి మరో నటి…ఆ నటి ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాజకీయ నాయకులు కాకుండా సినిమా నటులు పార్టీకి మద్దతు తెలపడం కొంత రాజకీయ నాయకులను ఆశ్చర్య పరుస్తోంది.అయితే ఇటీవల యాంకర్ శ్యామలా రెడ్డి షర్మిలను కలిసి తన మద్దతును తెలియజేసారు.

తాజాగా సీరియల్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ కూడా షర్మిలను కలిసి తన మద్దతును తెలియజేసారు.ఈ సందర్బంగా నటి ప్రియ మాట్లాడుతూ నాకు వైయస్సార్ అంటే ఎంతో గౌరవమని, నేను చూసిన గొప్ప రాజకీయ నాయకులలో వైఎస్సార్ ఒకరని, ఆయనను చాలా సార్లు కలవడానికి ప్రయత్నించానని, కాని నాకు ఆ అవకాశం దొరకలేదని, అందుకే షర్మిలకు మద్దతు తెలుపుతున్నానని ఆమె తెలిపారు.

వైఎస్సార్ ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని షర్మిల కూడా తనదైన పాలనతో వైఎస్సార్ వారసురాలిగా తనదైన ముద్ర వేసుకుంటారని వారు తెలిపారు.ఏది ఏమైనా షర్మిల పార్టీ మిగతా పార్టీలకు ఎంతో కొంత నష్టం కలుగుతుందనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

#ActressPriya #Y.s.sharmila #Sharmila Party #YS Sharmila #Actress Priya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు