హీరోయిన్స్ అందరికంటే తాను ప్రత్యేకం అని ప్రూవ్ చేసుకుంటున్న ప్రణీత

బావ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టిన కన్నడ భామ ప్రణీత.ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ కి జోడీగా అత్తారింటికి దారేది సినిమాలో అలాగే ఎన్టీఆర్ కి జోడీగా రభస సినిమాలో నటించింది.

 Actress Pranitha Subhash Speaks On The Save Govt Schools-TeluguStop.com

అలాగే యంగ్ హీరోలతో కూడా ఈ బ్యూటీ జత కట్టింది.అయితే అందం, అభినయం ఉన్న కూడా తెలుగులో అనుకున్న స్థాయిలో ఈ అమ్మడు సక్సెస్ కాలేకపోయింది.

అయితే మాతృభాషలో మాత్రం ఆమె స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకొని పెద్ద పెద్ద హీరోలతో నటించింది.ఇక హిందీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

 Actress Pranitha Subhash Speaks On The Save Govt Schools-హీరోయిన్స్ అందరికంటే తాను ప్రత్యేకం అని ప్రూవ్ చేసుకుంటున్న ప్రణీత-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం హిందీలో రెండు సినిమాలు ఈ భామ చేస్తుంది.ఇదిలా ఉంటే కరోనా కష్టకాలంలో హీరోయిన్స్ అందరూ ఇంటికే పరిమితమైపోయి ఉంటే ఒక్క ప్రణీత మాత్రం రోడ్డు మీదకి వచ్చి పేదలకి అండగా నిలబడింది.

వారికి ప్రతిరోజు భోజనాలు వండి అందించేది.అలాగే ఉడతాభక్తిగా ఆర్ధికసాయం కూడా చేసింది.

నటులలో సోనూసూద్ తర్వాత ఆ స్థాయిలో కరోనా కష్టకాలంలో పేదలకి అండగా ఉన్నవారు ఎవరంటే కచ్చితంగా ప్రణీత పేరు వినిపిస్తుంది.తల్లిదండ్రులు పెట్టిన ఎన్జీవో ద్వారా ఈ అమ్మడు తన సేవా కార్యక్రమాలు చేసింది.

ప్రణీత ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు ఆ సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తుంది.పేదలకి అండగా నిలబడటమే కాకుండా సేవ్‌ గవర్నమెంట్‌ స్కూల్స్ పేరుతో ప్రణీత బెంగళూరు నగరంలోని ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు.

ప్రణీత పేద ప్రజలకు హెల్త్ చెకప్ లు చేయించి వాళ్లకు ఆరోగ్యంపై అవగాహన కలిగేలా చేస్తున్నారు.ఈ తరం హీరోయిన్స్ అందరూ సంపాదించిన సొమ్ముని మరింత పెంచుకోవడానికి వ్యాపారాలు స్టార్ట్ చేస్తూ ఉంటే ఆమె నటిగా సంపాదిస్తున్న సొమ్ముని పూర్తిగా సేవా కార్యక్రమాల కోసం ఖర్చు పెడుతుంది.

సక్సెస్ ఫుల్ హీరోయిన్ కాలేకపోయిన ఈ విషయంలో మాత్రం తాను మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకోవడమే కాకుండా తాను చాలా ప్రత్యేకం అని అందరితో ప్రశంసలు అందుకుంటుంది.

#ActressPranitha #South Heroies #Bangalore

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు