బుల్లితెరపై వివాదాలకు దూరంగా ఉంటూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే యాంకర్లలో ప్రదీప్ ఒకరు.చాలా సంవత్సరాల నుంచి ప్రదీప్ సినిమా, టీవీ రంగాల్లో ఉన్నా ఆయన లవ్ ట్రాకులకు సంబంధించి వార్తలు గతంలో ఎప్పుడూ రాలేదు.
అయితే ప్రోగ్రామ్ ల నిర్వాహకులు కావాలనే క్రియేట్ చేస్తున్నారో లేక నిజంగానే ప్రదీప్ లవ్ ట్రాకులు నడుపుతున్నాడో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో ప్రదీప్ గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియా, వెబ్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఢీ షోకు జడ్జిగా వ్యవహరించే పూర్ణతో ప్రదీప్ లవ్ ట్రాక్ నడుపుతున్నట్టు వినిపిస్తున్నాయి.
తాజాగా నటి పూర్ణ ఏకంగా ప్రదీప్ కు తనతో తప్ప వేరే అమ్మాయిలతో మాట్లాడవద్దని కండీషన్ పెట్టారు.గతంలో రవి లాస్య పేర్లు యూట్యూబ్ జోడీలుగా వినిపించగా ఆ తర్వాత రష్మీ సుధీర్, హైపర్ ఆది వర్షిణి యూట్యూబ్ జోడీలుగా ఫేమస్ అయ్యారు.
తాజాగా ఆ జాబితాలోకి ప్రదీప్ పూర్ణ కూడా చేరిపోయారనే చెప్పాలి.
ఈటీవీ ఛానెల్ లో ప్రతి బుధవారం రాత్రి 9.30 గంటలకు ప్రసారమయ్యే ఢీ ఛాంపియన్స్ ప్రోగ్రామ్ లొ గత కొన్ని ఎపిసోడ్ల నుంచి పూర్ణ ప్రదీప్ ఒకరికొకరు సన్నిహితంగా మెలుగుతూ ప్రేక్షకులకు తమ మధ్య ఏదో ఉందని అనుమానం కలిగేలా చేస్తున్నారు.షోలో ఒక స్కిట్ లో భాగంగా పూర్ణ ప్రదీప్ కు అమ్మాయిలతో మాట్లాడొద్దని పూర్ణ చెప్పారు.
మరోవైపు ప్రదీప్ జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే సింగర్ హారికతో కూడా ప్రేమాయణం నడుపుతున్నట్టు కొందరు ప్రచారం చేస్తున్నారు.
అయితే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉన్న ప్రదీప్ ఇలాంటి లవ్ ట్రాకుల వల్ల పేరును చెడగొట్టుకుంటున్నాడని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు రాయలసీమకు చెందిన ప్రముఖ నేత కూతురిని ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.