నటి పవిత్ర లోకేష్ తండ్రి భర్త కూడా టాప్ స్టార్స్ అని మీకు తెలుసా ..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఆర్టిస్ట్ లు ఒకప్పుడు హీరోయిన్ గా చేసి ఇప్పుడు తల్లి పాత్ర లు చేస్తున్నారు.అప్పట్లో హీరో తల్లి అంటే 60 సంవత్సరాల పైబడిన ఆర్టిస్ట్ ని పెట్టేవారు.

 Actress Pavitra Lokesh Husband And Father Details.pavitra Lokesh ,pragathi, Mai-TeluguStop.com

కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది హీరో తల్లి పాత్రలు చేసే ఆర్టిస్టుల ఏజ్ కొందరికైతే 40 సంవత్సరాల లోపే ఉంటుంది.ఇప్పుడు హీరో తల్లిగా చేసి మంచి గుర్తింపు పొందుతున్న వాళ్ళలో ప్రగతి, పవిత్ర లోకేష్ లాంటి వారు ముందున్నారు.

పవిత్ర లోకేష్ ఏజ్ 42 సంవత్సరాలు కానీ ఆమె ఒక పది సంవత్సరాల ముందు నుంచే హీరో తల్లిగా యాక్ట్ చేస్తున్నారు.అంటే 35 సంవత్సరాలకె ఆమెని ఇండస్ట్రీలో హీరోలకి తల్లిని చేసేసారు అని మనం అర్థం చేసుకోవచ్చు.

అయితే పవిత్ర లోకేష్ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో హీరోయిన్ గా కొన్ని సినిమాలను చేశారు.దాంట్లో కొన్ని శృంగార భరితమైన సినిమాలు కూడా ఉన్నాయి.అయితే సినిమా హీరోయిన్ గా చేసినప్పుడు పెద్దగా సక్సెస్ లు రాలేదు దాంతో హీరోయిన్ గా కొనసాగుదాం అంటే అప్పుడు ఉన్న హీరో లు, డైరెక్టర్ల దగ్గర్నుంచి కాస్టింగ్ కౌచ్ పేరుతో కమిట్మెంటు అడిగేవారంట ఈ సినిమాలో మీరు హీరోయిన్ గా చేయాలంటే తప్పనిసరిగా కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పేవారట దీంతో హీరోయిన్ గా చేయడం ఇష్టం లేక సినిమా మీదున్న ఇంట్రెస్ట్ తో సినిమా ఇండస్ట్రీని వదలలేక తను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తల్లి పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది.తను తెలుగులో బావ, శక్తి , సన్నాఫ్ సత్యమూర్తి , టెంపర్, డిక్టేటర్, ఆరెంజ్, రేసుగుర్రం, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి సినిమాల్లో హీరోలకు తల్లిగా చేసింది.

అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరికీ తల్లి పాత్ర చేయడానికి ఉన్న ఒకే ఒక ఛాన్స్ పవిత్ర లోకేష్ గారు.ఆవిడ తల్లిగా.

Telugu Actresspavitra, Pagathi, Pavitra Lokesh-Telugu Stop Exclusive Top Stories

ప్రతి ఒక్క హీరో కి సెట్ అవుతుంది.టెంపర్ సినిమా లో తన కూతురు మిస్ అయిందని పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మాయి గురించి నెగిటివ్ గా మాట్లాడటంతో ఆమె ఒక బిడ్డ ని కోల్పోయిన తల్లి పడే బాధ ఎలా ఉంటుందో అలాంటి రియలిస్టిక్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారని టెంపర్ సినిమా హిట్ అయిన తర్వాత చాలామంది చెప్పారు.

Telugu Actresspavitra, Pagathi, Pavitra Lokesh-Telugu Stop Exclusive Top Stories

రేసుగుర్రం సినిమాలో తన ఇద్దరు పిల్లలు రోజూ దెబ్బలాడుకుంటుంటే చూడలేక ఒక తల్లి ఎలా బాధ పడుతుందో అలాంటి బాధని అనుభవిస్తూ ఈ రోజు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్న అమ్మలు ఎలాగైతే ప్రవర్తిస్తారు అలాగే ఆ క్యారెక్టర్ లో నటించడమే కాదు జీవించేసారూ అని కూడా మనం చెప్పవచ్చు.మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమా లో తన కొడుకు అథ్లెటిక్స్ లో గెలుపొందాలలని కోరుకునే ఒక తల్లి పాత్రలో ఆవిడ చాలా బాగా యాక్ట్ చేశారు.అయితే పవిత్ర లోకేష్ గారి తండ్రి మైసూర్ లోకేష్ ఆయన కూడా కన్నడలో ఆర్టిస్ట్ సినిమాల్లోనే కాకుండా ఆయన స్టేజి ఆర్టిస్ట్ కూడా అలాగే పవిత్ర లోకేష్ గారి బ్రదర్ అయినా ఆది లోకేష్ కూడా నటుడే, ఆమె భర్త కూడా నటుడే పవిత్ర లోకేష్ కాకుండా వాళ్ల కుటుంబం మొత్తం సినిమాకు సంబంధించిన వారే కావడం విశేషం.

ఏదేమైనా పవిత్ర లోకేష్ గారి ద్వారా ఇండస్ట్రీలో హీరోలకి ఒక మంచి తల్లి పాత్ర చేసే ఆర్టిస్టు దొరికిందని చెప్పొచ్చు.

పవిత్ర లోకేష్ గారి స్పెషాలిటీ ఏమిటంటే ఆమె యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలకు కూడా అమ్మ అని చెప్తే నమ్మేస్తారు.

అందుకే ఇప్పుడు వచ్చే ప్రతి సినిమాలో ఆవిడే అమ్మ పాత్రలు చేస్తుంది.ఆవిడ ప్రతి ఎక్స్ప్రెషన్ ని ఈజీగా పండిస్తుంది.

సెంటిమెంట్ సీన్లలో అయితే ఆమె నిజంగానే ఏడుస్తుందా అని ప్రేక్షకుడు అనుకునేటట్టుగా ఆ పాత్రలో జీవించేస్తుంది.అయితే ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన రాధిక,దేవయాని, సితార లాంటి ఆర్టిస్టులు కూడా తల్లిగా చేస్తున్నప్పటికీ చాలా సినిమాల్లో పవిత్ర లోకేష్ గారిని ఎక్కువ తల్లి పాత్రలకు తీసుకుంటున్నారు.

ఎందుకంటే రాధిక, దేవయాని, సితార ఇలాంటి వారు కూడా గొప్ప ఆర్టిస్ట్ లే కానీ ఇంతకు ముందు మనం వాళ్ళ యాక్టింగ్ చూసాము.కాబట్టి తల్లి పాత్రలకి పవిత్ర లోకేష్ అయితేనే సరిగ్గా సరిపోతారని దర్శక నిర్మాతలు అనుకుని ఎక్కువగా ఈవిడ వైపే మొగ్గు చూపుతున్నారు.

పవిత్ర లోకేష్ మొదట్లో మలయాళం సినిమాల్లో నటించినప్పటికీ తాను కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube