ఊహ మేనమామ ఎంత పెద్ద నటుడో తెలుసా?

సినీ పరిశ్రమలో ప్రస్తుతం అవకాశాలు దక్కాలంటే ఎంతో ప్రతిభ ఉండాలి.లేదంటే సినీ బ్యాక్ గ్రౌండ్ అయినా ఉండాలి.

 Actress Ooha Personal Life Shocking Secrets, Actress Ooha, Personal Life, Shocki-TeluguStop.com

అప్పుడే సినీ ఇండస్ట్రీలో అవకాశాలు తొందరగా లభిస్తాయి.ప్రస్తుతం మన తెలుగు ఇండస్ట్రీలో దాదాపు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలే మనకు తెరపై కనిపిస్తుంటారు.

అంతేకాకుండా మరికొందరు సినీ ఫీల్డ్ లో ట్రైనింగ్ తీసుకుని మెల్లమెల్లగా వెండితెర వైపు అడుగులు వేస్తున్నారు.అయితే దశాబ్దాల క్రితం సినిమా రంగంలో ప్రవేశించిన వారు ఎక్కువగా నాటక రంగాలలో ప్రావీణ్యం ఉన్న వారే సినిమా రంగంలో నటించారు.

ఈ తరహాలోనే ఎన్నో కష్టాలు పడి సినీ రంగంలో నిలదొక్కుకున్న వ్యక్తి పి ఎల్ నారాయణ మలయాళ కుటుంబానికి చెందిన ఈయన గుంటూరులో పుట్టి పెరిగారు.నాటకాలపై ఎక్కువ ఆసక్తి ఉండడంతో ఒంగోలు వెళ్లి నాటకాలను వేసేవారు.

నారాయణ వేసిన నాటకాలలో”కుక్క” అనే నాటకానికి జాతీయస్థాయి అవార్డు దక్కింది.ఈ నాటకమే ఆయనకు సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది.

ఎన్నో సినిమాలలో లాయరు, బడిపంతులు, రాజకీయ నాయకులు వంటి ఏపాత్రలలో నటించిన ఆ పాత్రకు ప్రాణం పోసి 100% న్యాయం చేసేవారు.నారాయణ గారు తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 300 సినిమాలలో నటించి ఎంతో పేరును సంపాదించుకున్నారు.

అంతేకాకుండా ఈయన కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఎదిగి ఒక హీరో ని పెళ్లి చేసుకుని స్థిరపడింది.ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు అలనాటి తార ఊహ… ఊహ స్వయాన నారాయణ గారు మేనకోడలు.

ఊహ 1990వ సంవత్సరంలో కన్నడ చిత్రం హృదయ సామ్రాజ్యం అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు.అయితే “ఆమె” సినిమా ద్వారా శ్రీకాంత్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఊహ, ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

శివరంజని గా ఉన్న ఈమె పేరు “ఆమె” దర్శకుడు ఇవివి సత్యనారాయణ ఆమెకు ఊహ అనే పేరును పెట్టాడు.తెలుగు హీరో శ్రీకాంత్ సరసన ఊహ ఎన్నో సినిమాలలో నటించడంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి దాకా వెళ్ళింది.

అయితే ఊహ నటించిన మొదటి, చివరి సినిమా శ్రీకాంత్ తోనే కావడం విశేషం.పెళ్లి తర్వాత ఈమె తన సినీ జీవితానికి దూరంగా ఉంటూ… ఆమె కుటుంబ బాధ్యతలలో మునిగిపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube