సినిమాల్లోకి రాకముందు నివేదా పేతురాజ్ ఏం చేసేవారో తెలుసా?

తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోకపోయినా చిన్న హీరోలు, మిడిల్ రేంజ్ హీరోల సినిమాల్లో ఎక్కువగా నివేదా పేతురాజ్ కు ఆఫర్లు వస్తున్నాయి.తమిళనాడులోని మధురైలో పుట్టిన నివేదా దుబాయ్ లో పెరిగారు.

 Actress Nivetha Pethuraj  Shares About Her Life, Actress Nivetha Pethuraj  ,nive-TeluguStop.com

నివేదా పేతురాజ్ తల్లి గృహిణి కాగా తండ్రి ఇంజినీర్ గా పని చేసేవారు.దుబాయ్ లో మేనేజ్ మెంట్ డిగ్రీ చదివిన నివేదా పేతురాజ్ సినిమాల్లో ఎక్కువగా సీరియస్ పాత్రల్లోనే నటించి మెప్పించారు.
సినిమాల్లోని పాత్రలకు, రియల్ లైఫ్ కు సంబంధం ఉండదని రియల్ లైఫ్ లో తాను ఎంతో సరదాగా ఉంటానని నివేదా చెప్పుకొచ్చారు.సినిమా ఇండస్ట్రీలోకి నటిగా ఎంట్రీ ఇవ్వకముందు బొటిక్స్ నడిపానని, ఈవెంట్లు చేశానని, కొన్ని కార్ల కంపెనీలలో తాను పని చేశానని నివేదా వెల్లడించారు.

తాను అందంగా ఉండటంతో సినిమాల్లో ట్రై చేయమని కొంతమంది సూచించగా తెలుగు సినిమాలో ఛాన్స్ వచ్చిందని నివేదా అన్నారు.

Telugu Actressnivetha, Niveda Pethuraj, Nivethapethuraj, Personal, Virataparvam-

అయితే తెలుగు సినిమాలో నటించే అవకాశం వచ్చినా అమ్మానాన్నలకు తన నిర్ణయం నచ్చలేదని ఆమె అన్నారు.కొన్నేళ్ల తర్వాత తల్లిదండ్రులు సినిమాల్లో నటించడానికి ఓకే చెప్పడంతో తమిళంలో ఒరు నా కూత్తు తెలుగులో మెంటల్ మదిలో సినిమాలతో ఎంట్రీ ఇచ్చానని నివేదా చెప్పుకొచ్చారు.సినిమాలు మాత్రమే లైఫ్ అని అనుకోనని విభిన్నమైన పాత్రలను ఎంచుకుని ప్రేక్షకులను మెప్పించాలని భావిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

రేసింగ్ అంటే తనకు చాలా ఇష్టమని నివేదా పేతురాజ్ చెప్పుకొచ్చారు.పెద్దలు కుదిర్చిన వివాహమే తాను చేసుకుంటానని తనకు బెస్ట్ క్రిటిక్ తమ్ముడు నిషాంత్ అని ఆమె కామెంట్లు చేశారు.

ఒకవేళ నటిని కాకపోయి ఉంటే యోగా ఇన్ స్ట్రక్టర్ గా ఉండేదానినని ఆమె అన్నారు.విరాటపర్వం సినిమాలో చిన్న పాత్రలో నటించానని నివేదా కామెంట్లు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube