నడవలేని స్థితిలో స్టార్ హీరోయిన్ నిత్యామీనన్.. ఏంజరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా మంచి సినిమాలు చేయడం ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న హీరోయిన్లలో నిత్యామీనన్ ఒకరు.ఈ ఏడాది భీమ్లా నాయక్ సినిమాతో నిత్యామీనన్ ఖాతాలో సక్సెస్ చేరింది.

 Actress Nityamenon Modern Love Hyderabad Web Series Trailer Launch Event , Nityamenon, Situation , Bheemla Nayak, Elbow Crutch, Modern Love-TeluguStop.com

భీమ్లా నాయక్ సినిమాలో నిత్యామీనన్ రోల్ పరిమితమే అయినా తన నటనతో నిత్యామీనన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.నిత్యామీనన్ నటించిన మోడ్రన్ లవ్ హైదరాబాద్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చే నెల 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

తాజాగా ఈ వెబ్ సిరీస్ నుంచి ట్రైలర్ రిలీజ్ కాగా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.అయితే ఈ వెబ్ సిరీస్ లాంఛ్ కార్యక్రమంలో నిత్యామీనన్ నడవలేని స్థితిలో కనిపించారు.

 Actress Nityamenon Modern Love Hyderabad Web Series Trailer Launch Event , Nityamenon, Situation , Bheemla Nayak, Elbow Crutch, Modern Love-నడవలేని స్థితిలో స్టార్ హీరోయిన్ నిత్యామీనన్.. ఏంజరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ఈవెంట్ లో నిత్యామీనన్ స్టిక్ పట్టుకుని కనిపించగా తనకు నడవలేని స్థితి రావడానికి సంబంధించి నిత్యామీనన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.నిత్యామీనన్ మాట్లాడుతూ ఈ వెబ్ సిరీస్ లో తాను ఎల్బో క్రచ్ తో కనిపించానని ఆమె తెలిపారు.

అయితే వెబ్ సిరీస్ లో ఏ విధంగా జరిగిందో నిజ జీవితంలో కూడా అదే విధంగా జరుగుతోందని ఆమె కామెంట్లు చేశారు.రెండురోజుల క్రితం తాను మెట్లపై నుంచి కింద పడ్డానని ఆమె చెప్పుకొచ్చారు.

అందువల్లే ఎల్బో క్రచ్ తో తాను నడవాల్సి వస్తోందని ఆమె తెలిపారు.రేవతి మేడం నాకు సొంత ఇంటి మనిషిలా అనిపిస్తారని నిత్యామీనన్ కామెంట్లు చేశారు.

రేవతి మేడం ఎలా ఉంటారో అమ్మ కూడా అలానే ఉంటారని నిత్యామీనన్ అన్నారు.

ఈ వెబ్ సిరీస్ తో నిత్యామీనన్ సక్సెస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.సినిమాసినిమాకు నిత్యామీనన్ కు ప్రేక్షకుల్లో క్రేజ్ పెరుగుతోంది.నిత్యామీనన్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

నిత్యామీనన్ కోటి నుంచి రెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube