హోటల్ వ్యాపారంలో 50 లక్షలు పోగొట్టుకున్న సౌత్ హీరోయిన్

సౌత్ లో హీరోయిన్ గా రాణిస్తున్న నిక్కీ గల్రానీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కన్నడ భామ సంజనా గల్రానీ చెల్లిగా సినిమాలలోకి అడుగుపెట్టిన ఈ భామ అక్క కంటే ఎక్కువ ఫేమ్ ని సొంతం చేసుకుంది.

 Actress Nikki Galrani Files Financial Fraud Complaint-TeluguStop.com

కన్నడ సినిమాలతో కెరియర్ ప్రారంభించి తరువాత తమిళ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సక్సెస్ అయ్యింది.తెలుగులో సునీల్ కి జోడీగా కృష్ణాష్టమి సినిమాలో హీరోయిన్ గా నటించింది.

తమిళ్ లో ఆది పినిశెట్టికి జోడీగా మలుపు, మరకతమణి సినిమాలలో నటించింది.ఇప్పుడు ఆదితోనే మరో సినిమాలో కూడా ఈ భామ నటిస్తుంది.

 Actress Nikki Galrani Files Financial Fraud Complaint-హోటల్ వ్యాపారంలో 50 లక్షలు పోగొట్టుకున్న సౌత్ హీరోయిన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తమిళ్ లో నిక్కీకి భాగానే అవకాశాలు వస్తున్నాయి.మరో వైపు హీరో ఆది పినిశెట్టితో నిక్కీ ప్రేమలో ఉందని, వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే టాక్ గత కొంత కాలంగా సౌత్ లో వినిపిస్తుంది.

అయితే దీనిపై వారి నుంచి ఎలాంటి వివరణ రాలేదు.ఇదిలా ఉంటే తాజాగా నిక్కీ బెంగుళూరు పోలీస్ స్టేషన్ లో తనని ఓ వ్యక్తి చీటింగ్ చేసి 50 లక్షలు దోచేసాడని ఫిర్యాదు చేసింది.

బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో నివాసం ఉంటున్న నిఖిల్ అనే వ్యక్తి ఓ హోటల్ ను ప్రారంభించారు.అతనితో కలిసి హోటల్ బిజినెస్ లోకి అడుగుపెడదామని నిక్కీ కూడా 50 లక్షల వరకూ పెట్టుబడిగా పెట్టింది.

ఇందుకు ప్రతిఫలంగా తాను నెలకు 1 లక్ష ఇస్తానని నిఖిల్, నిక్కీ గల్రానీకి హామీ ఇచ్చాడు.అయితే పెట్టుబడి పెట్టి ఎంతకాలమైనా నిక్కీకి అతను ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు.

దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న ఆమె, పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు, హోటల్ యజమానిని పిలిచి విచారిస్తున్నామని తెలిపారు.

#BangalorePolice #Cheating #Financial Fraud #Bangalore #Nikhil

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు