నా కొడుకు ఎదుగుతున్నాడు.. వైరల్ అవుతున్న నిహారిక పోస్ట్..?

మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక చాలా టాలెంటెడ్ అనే సంగతి తెలిసిందే.ఢీ షోకు యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన నిహారిక ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సిరీస్ తో తనలో మంచి నటి ఉందని ప్రూవ్ చేసుకున్నారు.

 Actress Mega Daughter Niharika Konidela Post About Her Pet Dog, Baby Boy, Nihari-TeluguStop.com

ఆ తరువాత ఒక మనస్సు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాల్లో నిహారిక నటించారు.గతేడాది చైతన్యను వివాహం చేసుకున్న నిహారిక పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటున్నారు.

తన లైఫ్ కు సంబంధించిన ఎన్నో కీలక విషయాలను అభిమానులతో పంచుకుంటూ నిహారిక వార్తల్లో నిలుస్తున్నారు.ఈ మధ్య కాలంలో వస్త్రధారణ విషయంలో మారిన నిహారిక వంటింట్లోకి దూరి కొత్తకొత్త వంటలను సైతం ట్రై చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

లాక్ డౌన్ వల్ల పూర్తిగా ఇంటికే పరిమితమైన నిహారిక ఏదో ఒక పని చేస్తూ అభిమానులతో ఆ విషయాలను పంచుకుంటూ ఉండటం గమనార్హం.

పెళ్లి తరువాత చైతన్య నిహారికకు ఒక పెట్ ను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే.

Telugu Baby Boy, Buzz, Corona Lock, Fans, Niharika Offers-Movie

బజ్ అని ఆ పెట్ కు నిహారిక నామకరణం చేశారు.తాజాగా నిహారిక సోషల్ మీడియాలో పెట్ ఫోటోను షేర్ చేసుకుంటూ తన బేబీ బాయ్ ఎదుగుతున్నాడని పేర్కొన్నారు.నిహారిక చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Telugu Baby Boy, Buzz, Corona Lock, Fans, Niharika Offers-Movie

నిహారిక ఈ పెట్ ను తన కొడుకుగా భావిస్తూ ఉండటం గమనార్హం.

మరోవైపు పెళ్లి తరువాత పరిమితంగా సినిమాల్లో నటిస్తున్న నిహారిక నిర్మాతగా కూడా బిజీ అవుతున్నారు.అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం నిహారిక కమర్షియల్ సినిమాల్లో నటించాలని కోరుకుంటూ ఉండటం గమనార్హం.

మరి నిహారిక కమర్షియల్ సినిమాలపై ఆసక్తి చూపుతారో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube