అలాంటి అబ్బాయి కోసం ఎదురుచూస్తున్నా.. నిధి ఆసక్తికర పోస్ట్!

Actress Nidhi Agarwal Interesting Post For A Sundar And Sushil Ladka

నటిగా, మోడల్ గా తెలుగుతో పాటు ఇతర భాషల్లో నిధి అగర్వాల్ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.మున్నా మైఖేల్ అనే సినిమాతో నిధి అగర్వాల్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

 Actress Nidhi Agarwal Interesting Post For A Sundar And Sushil Ladka-TeluguStop.com

హైదరాబాద్ లో పుట్టిన ఈ బ్యూటీ బెంగళూరులో పెరిగారు.తెలుగుతో పాటు కన్నడ, తమిళం భాషలలో నిధి అగర్వాల్ సులభంగా మాట్లాడగలరు.

సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి నిధి అగర్వాల్ ఎంట్రీ ఇచ్చారు.

 Actress Nidhi Agarwal Interesting Post For A Sundar And Sushil Ladka-అలాంటి అబ్బాయి కోసం ఎదురుచూస్తున్నా.. నిధి ఆసక్తికర పోస్ట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే సవ్యసాచి సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు.

ప్రస్తుతం నిధి అగర్వాల్ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాతో బిజీగా ఉన్నారు.వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజయ్యే ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని నిధి అగర్వాల్ నమ్ముతున్నారు.

ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ ద్వారా పెరిగిన క్రేజ్ వల్ల హరిహర వీరమల్లు సినిమాలో ఈ బ్యూటీకి ఛాన్స్ దక్కింది.

తాజాగా ఈ బ్యూటీ పింక్ కలర్ చీరలో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.నిధి షేర్ చేసిన ఈ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.ఈ పోస్ట్ కు క్యాప్షన్ గా ” ఒక అందమైన, మంచి అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నాను” అని నిధి అగర్వాల్ పేర్కొన్నారు.

నిధి అగర్వాల్ చేసిన కామెంట్ ను చూసి ఆమె పెళ్లిపై ఆసక్తి చూపిస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

అయితే కొంతమంది మాత్రం నిధి అగర్వాల్ సరదాగానే ఈ విధంగా పోస్ట్ పెట్టి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.నిధి అగర్వాల్ ఈ సినిమాతో పాటు హీరో అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నారు.నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ కాకపోయినా నిధికి ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు.

#Nidhi Agarwal #Groom

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube