సినిమాల్లో ఒక్క అవకాశం కోసం ఆ పని చేశా.. నిధి ఆసక్తికర వ్యాఖ్యలు!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ కావాలంటే సులువైన విషయం కాదు.అందం, అభినయం ఉన్నా బ్యాక్ గ్రౌండ్ లేనివాళ్లు ఎంతో కష్టపడితే మాత్రమే తప్పా సినిమా రంగంలో గుర్తింపు దక్కుతుంది.

 Actress Nidhi Agarwal Interesting Comments About Her Career, Nidhi Agarwa , Comm-TeluguStop.com

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కు జోడీగా హరిహర వీరమల్లు పేరుతో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నారు.ఈ బ్యూటీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో తాను తిరస్కరణలు ఎదుర్కొన్నానని నిధి తెలిపారు.

హీరోయిన్ గా తొలి ఛాన్స్ ను అందుకోవడానికి తాను చాలా కష్టాలు పడాల్సి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు.ఎన్నో అడిషన్స్ కు తాను హాజరు కాగా తనను రిజెక్ట్ చేశారని నిధి పేర్కొన్నారు.

గ్లామర్ రోల్స్ తో పాటు అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్న ఈ బ్యూటీ కోలీవుడ్, టాలీవుడ్ భాషలలో వరుసగా సినిమా ఆఫర్లను అందిపుచ్చుకుంటున్నారు.తాజాగా సోషల్ మీడియాలలో ఒకటైన ట్విట్టర్ ద్వారా నిధి అభిమానులతో ముచ్చటించారు.

Telugu Career, Kollywood, Krish, Nidhi Agarwal, Pawan Kalyan-Movie

ఇతరులతో తనను తాను పోల్చుకోవడం అస్సలు నచ్చదని నిధి పేర్కొన్నారు.కేరీర్ స్టార్టింగ్ లో ఒక్క ఛాన్స్ కొరకు తాను ఎన్నో ప్రార్థనలు చేశానని నిధి అగర్వాల్ వెల్లడించారు.అయితే తిరస్కరణలు ఎదురైన సమయంలో తాను ఏ మాత్రం అధైర్యపడలేదని హార్డ్ వర్క్ ద్వారా కన్న కలలను తాను నిజం చేసుకున్నానని నిధి అగర్వాల్ అన్నారు.ఐశ్వర్యారాయ్ నటిగా తనకు స్పూర్తి అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చారు.

Telugu Career, Kollywood, Krish, Nidhi Agarwal, Pawan Kalyan-Movie

అనుష్క, కాజల్ ను తాను ఎక్కువగా ఇష్టపడతానని ఆమె కామెంట్లు చేశారు.శక్తివంతమైన మహిళా ప్రధాన చిత్రాలు చేయాలని తన కోరిక అని నిధి అగర్వాల్ పేర్కొన్నారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో తాను హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్నానని 2022లో తాను నటించిన మూడు సినిమాలు రిలీజవుతాయని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube